Kondapolam movie: కొండ పొలం మూవీకి Censor పూర్తి

Kondapolam movie release date updates: ఉప్పెన మూవీతో ఫస్ట్ సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. వైష్ణవ్ తేజ్ సరసన ఓబులమ్మ అనే యువతి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ (Actress Rakul preet Singh) జంటగా నటించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 1, 2021, 12:49 PM IST
Kondapolam movie: కొండ పొలం మూవీకి Censor పూర్తి

Kondapolam movie release date updates: కొండ పొలం మూవీ విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. అడవిలో గొర్రెల పెంపకమే జీవనాధారంగా బతికే గిరిజనులకు అడవిలో కృూరమృగాల నుంచి, కృూరమృగాల లాంటి మనుషుల నుంచి ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఆ అమాయకులు ఎలా అధిగమించారనే కథాంశం ఆధారంగా తెరకెక్కిన సినిమా కొండ పొలం. 

ఉప్పెన మూవీతో ఫస్ట్ సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. వైష్ణవ్ తేజ్ సరసన ఓబులమ్మ అనే యువతి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ (Actress Rakul preet Singh) జంటగా నటించింది. ఇటీవలే విడుదలైన కొండ పొలం మూవీ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. 

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ యూ సర్టిఫికెట్ జారీచేసింది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌కి దసరా పండగ కానుకగా (Dussehra 2021) అంతకంటే వారం రోజులు ముందుగానే.. అంటే అక్టోబర్ 8న విడుదల కానుంది. 

సందేశంతో కూడిన సామాజిక చిత్రాలను రూపొందించడంలో క్రిష్‌కి మంచి పేరుంది. అందుకు ఉదాహరణగా కులాల మధ్య గోడలు కూల్చే కథనంతో క్రిష్ తెరకెక్కించిన కంచె సినిమానే చెప్పుకోవచ్చు. అందుకే కొండ పొలం (Kondapolam movie trailer) అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టి ఈసారి ఎలాంటి మెసేజ్ ఇవ్వనున్నాడా అనే ఆసక్తి ఆడియెన్స్‌లో నెలకొని ఉంది. అదేంటో తెలియాలంటే మరో వారం రోజులు వేచిచూడాల్సిందే.

Also read : Most Eligible Bachelor Trailer: మన లైఫ్ పార్ట్‌నర్‌తో కనీసం 9వేల నైట్స్ కలిసి పడుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News