KGF 2 Review: KGF 2 ఓ చెత్త సినిమా- ప్రశాంత్ నీల్ ను జీవితాంతం జైల్లో పెట్టాలి: ఫిల్మ్ క్రిటిక్ KRK

KGF 2 Review: కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తూ.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కేజీఎఫ్ ఛాప్టర్ 2'. ఈ సినిమాను గురువారం (ఏప్రిల్ 14) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీకి ఫ్యాన్స్ నుంచి సూపర్ హిట్ టాక్ వస్తుంటే.. బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ మాత్రం అందుకు భిన్నంగా కామెంట్ చేస్తున్నాడు. 'కేజీఎఫ్ 2' మూవీ చెత్తగా ఉందని.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను జీవితాంతం జైలులో ఉంచాలని సంచలన కామెంట్స్ చేశాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2022, 06:01 PM IST
KGF 2 Review: KGF 2 ఓ చెత్త సినిమా- ప్రశాంత్ నీల్ ను జీవితాంతం జైల్లో పెట్టాలి: ఫిల్మ్ క్రిటిక్ KRK

KGF 2 Review: కన్నడ సూపర్ హిట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన మూవీ 'కేజీఎఫ్ ఛాప్టర్ 1'. దాదాపుగా మూడేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' గురువారం (ఏప్రిల్ 14) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 

ఈ చిత్రాన్ని బుధవారం నుంచే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. 'కేజీఎఫ్ 1' కంటే 'కేజీఎఫ్ 2' మూవీనే అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు మంచి మార్కులే పడ్డాయి. ఎటు చూసినా.. ఈ మూవీకి మంచి రివ్యూలు, రేటింగ్స్ వస్తున్నాయి. భారతీయ సినీ పరిశ్రమ చరిత్రలో సరికొత్త రికార్డులను నెలకొల్పే సత్తా ఈ సినిమాకు ఉందని అభిమానులు అంటున్నాయి. 

కానీ, బాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ క్రిటిక్ మాత్రం అందుకు భిన్నంగా 'కేజీఎఫ్ 2' మూవీ రివ్యూ ఇచ్చారు. 'కేజీఎఫ్ 2' ఓ చెత్త సినిమా అని.. ఈ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను జీవితాంతం జైలులో ఉంచాలని సంచలన కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఇదే విషయమై సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. 'కేజీఎఫ్ 2' సినిమా చూసిన బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ఈ విధంగా ట్వీట్ చేశాడు. 

"సినిమాకు వెళ్లేలోపు 30 నిమిషాలు గడిచిపోయింది. అసలు ఈ మూవీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మైండ్ మొత్తం కరాబు అయ్యింది. RRR కంటే 10 రెట్లు చెత్త సినిమా ఇది."

"నేను ఎన్నో చెత్త చెత్త సినిమాలను చూశాను కానీ, ఇలాంటి చెత్త మూవీని మాత్రం ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి సినిమా తెరకెక్కించినందుకు ప్రతి ఒక్కరూ సిగ్గు పడాలి."

"ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని పూల్స్ ను చేసినందుకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను జీవితాంతం జైలులోనే ఉంచాలి.  ఇలాంటి బుర్రలేని డైరెక్టర్లను నటీనటులు అసలు ఎంకరేజ్ చేయకూడదు."

"భారత త్రివిధ దళాలు (ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ) కలిసొచ్చినా.. ఒక మనిషి వ్యతిరేకంగా యుద్ధాన్ని చేయలేకపోయాయి. ప్రధానమంత్రి ఆఫీస్ లోకి వెళ్లిన రాకీ (హీరో యష్).. ఆమెను బెదిరిస్తాడు. సూపర్...! ప్రశాంత్ అన్న.. ఇప్పుడు చైనా, పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఇండియా ఎలా ఫైట్ చేయాలో కూడా కొంచెం చెప్తారా?" అంటూ బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేశారు. 

మండిపడుతున్న ఫ్యాన్స్

అయితే కమల్ ఆర్ ఖాన్ చేసిన ట్వీట్స్ పై పలువురు నెటిజన్లు అభ్యంతరాలు తెలుపుతున్నారు. తమ అభిమాన చిత్రంపై ఇలాంటి విద్వేషాన్ని వెల్లగక్కాల్సిన అవసరం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ఫ్యాన్స్.. నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నందుకు KRK పై చర్యలు తీసుకోవాలని ముంబయి పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నారు.   

Also Read: KGF 2 Twitter Review: కేజీఎఫ్ 2 ట్విట్టర్ రివ్యూ... సినిమాపై నెటిజన్ల టాక్... 'టెర్రిఫిక్ మెంటల్ మాస్'...

Also Read: Nivetha Pethuraj Photos: అందంతో కుర్రకారు 'మెంటల్ మదిలో' మాయ చేస్తోంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News