KGF 2 Collection: బాలీవుడ్ లో 'కేజీఎఫ్ 2' హవా.. 'బాహుబలి 2' రికార్డులను కొల్లగొడుతోందా?

KGF 2 Collection: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'కేజీఎఫ్ 2'. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ ను కొల్లగొడుతోంది. ఇప్పుడీ చిత్రం హిందీలో రూ.350 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. ఈ క్రమంలో 'బాహుబలి 2' సినిమా రికార్డులను అధిగమించే అవకాశం కనిపిస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2022, 11:52 AM IST
KGF 2 Collection: బాలీవుడ్ లో 'కేజీఎఫ్ 2' హవా.. 'బాహుబలి 2' రికార్డులను కొల్లగొడుతోందా?

KGF 2 Collection: రాకింగ్ స్టార్ యష్ ప్రధానపాత్రలో ప్రశాంత్ నీల్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'కేజీఎఫ్'. 2018లో విడుదలైన తొలి భాగానికి విపరీతమైన క్రేజ్ లభించింది. దీంతో ఇప్పుడా సినిమాకు కొనసాగింపుగా 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' సినిమాను ఇటీవలే థియేటర్లలో విడుదల చేశారు. ఈ సీక్వెల్ కూడా ప్రేక్షకుల నుంచి విశేషాదరణ వస్తోంది. 

ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులను 'కేజీఎఫ్ 2' సృష్టిస్తోంది. మరోవైపు కరోనా సంక్షోభం తర్వాత బాలీవుడ్ లో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం 'కేజీఎఫ్ 2' నిలిచింది. 

బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం..

ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'కేజీఎఫ్ 2' చిత్రం విజయవంతంగా రెండో వారాన్ని పూర్తి చేసుకుంది. గత శనివారం హిందీ మార్కెట్లో రూ. 50 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం.. ఆదివారం నాడు రూ. 40 కోట్ల పైచీలుకు కొల్లగొట్టింది. 

కరోనా తర్వాత ఇదే తొలిసారి..

గత రెండు వారాల్లో రూ. 350 కోట్ల కలెక్షన్స్ ను 'కేజీఎఫ్ 2' చిత్రం సాధించింది. అది కూడా కేవలం హిందీ మార్కెట్లోనే కావడం గమనార్హం. ఇప్పుడీ సినిమా రూ. 400 కోట్ల కలెక్షన్స్ లక్ష్యంగా థియేటర్లలో కొనసాగుతోంది. అయితే కరోనా తర్వాత హిందీ చిత్రానికి ఇంతటి కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి. కానీ, అంతకుముందు ప్రభాస్ నటించిన 'బాహుబలి 2' చిత్రం (హిందీ వర్షెన్) బాక్సాఫీసు వద్ద రూ. 511 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది.  

Also Read: Sarkaru Vaari Paata Story: మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా పూర్తి స్టోరీ ఇదేనా?

Also Read: Kajal Aggarwal in Acharya: 'ఆచార్య' మూవీ టీజర్, ట్రైలర్ లలో కాజల్ అగర్వాల్ లేదేంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News