karate kalyani vs srikanth reddy: ప్రాంక్ వీడియోల గురించి ఫ్రాంక్‌గా చెప్పాలంటే..

karate kalyani vs srikanth reddy Debate: శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కల్యాణి దాడి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిందనుకుంటే.. అంతకంటే ఎక్కువ ఆ దాడి వెనుకున్న కారణం ఏంటని ఆరా తీస్తూ మీడియాలో జరిగిన డిబేట్లు మరింత వైరల్ అయ్యాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 07:40 PM IST
  • శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కల్యాణి దాడి వీడియో తెగ వైరల్
  • ప్రాంక్ వీడియోల పేరుతో అమ్మాయిల జీవితాలతో ఆటలా అంటున్న కరాటే కల్యాణి
  • ప్రాంక్ వీడియోల గురించి ఫ్రాంక్‌గా చెప్పాలంటే.. ఎవరేమంటున్నారో మీరే చూడండి
karate kalyani vs srikanth reddy: ప్రాంక్ వీడియోల గురించి ఫ్రాంక్‌గా చెప్పాలంటే..

Karate Kalyani vs Srikanth Reddy Debate: శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కల్యాణి దాడి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిందనుకుంటే.. అంతకంటే ఎక్కువ ఆ దాడి వెనుకున్న కారణం ఏంటని ఆరా తీస్తూ మీడియాలో జరిగిన డిబేట్లు మరింత వైరల్ అయ్యాయి. కరాటే కల్యాణి వెళ్లి శ్రీకాంత్‌పై ఎందుకు దాడి చేసిందనే సంగతి పక్కనపెడితే.. అంతకు మించిన ఆసక్తికరమైన అంశాలెన్నో ఈ డిబేట్లలో వెలుగుచూశాయి. శ్రీకాంత్ రెడ్డి తాను రూపొందించే ప్రాంక్ వీడియోల పేరుతో అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడని కరాటే కల్యాణి ఆరోపిస్తుండగా.. బతుకుదెరువు కోసం ఇష్టపూర్తిగానే ఈ ప్రాంక్ వీడియోలు చేస్తున్నామని.. తమ లాంటి వారికి ఎందరికో శ్రీకాంత్ రెడ్డి బతుకుదెరువు చూపిస్తున్నాడని అతడితో కలిసి ప్రాంక్ వీడియోలు చేస్తోన్న వర్షిణి లాంటి వారు చెబుతున్నారు.    

ఈ నేపథ్యంలో ప్రాంక్ వీడియోలపై సోషల్ మీడియాలో పెను దుమారం చెలరేగుతోంది. నిన్నటి మొన్నటి వరకు ప్రాంక్ వీడియోలు చూసే వారికి మాత్రమే తెలిసిన ఈ ప్రాంక్‌స్టర్స్, వారి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. దీంతో ప్రాంక్ వీడియోల పేరుతో రోడ్డుపై వెళ్లే వారిని భయపెట్టడం, వేధించడం కొంతమంది పనైతే.. అదే ప్రాంకులను ముందే రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి, అవి చూసే జనాలను పిచ్చోళ్లను చేయడం ఇంకొంత మంది పనిగా పెట్టుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్‌ రెడ్డి, కరాటే కల్యాణికి మద్దతుగా నిలుస్తున్న ఆర్టిస్టులు, యూట్యూబర్స్‌ని... వారితో విభేదిస్తున్న వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది జీ తెలుగు న్యూస్. ఈ చర్చలో ఎవరి అభిప్రాయాలు ఏంటో మీరే ప్రత్యక్షంగా వీక్షించండి.

Trending News