Balakrishna pays Final Respects to Puneeth: పునీత్‌ను కడసారి చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ

Balakrishna pays Final Respects To Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంతో బాలయ్యకు మంచి అనుబంధం ఉంది. తనకెంతో ఆప్తుడైన పునీత్‌ రాజ్‌కుమార్ మరణంతో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బాల‌కృష్ణ .. పునీత్ పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2021, 01:16 PM IST
  • పునీత్‌ రాజ్‌కుమార్ మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన నందమూరి బాలకృష్ణ
  • కన్నీరు పెట్టుకున్న బాలయ్య
  • భావోద్వేగానికి లోనైన బాలకృష్ణ
 Balakrishna pays Final Respects to Puneeth: పునీత్‌ను కడసారి చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ

Kannada Hero Puneeth Rajkumar Death LIVE Updates Tollywood Hero Nandamuri Balakrishna pays Final Respects To Puneeth Rajkumar: శాండ‌ల్‌వుడ్ న‌టుడు కన్నడ పవర్‌‌ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (Kannada Power Star Puneet Rajkumar) చిన్న వయసులోనే అకాల మరణం చెందడంతో అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యారు. వెండితెరపై మాత్రమే కాకుండా సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే పునీత్ హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో అంద‌రూ శోక‌సంద్రంలో మునిగారు. పునీత్ మృతి ప‌ట్ల శాండ‌ల్‌వుడ్ ప్ర‌ముఖ‌లే కాక టాలీవుడ్‌,(Tollywood‌) బాలీవుడ్, కోలీవుడ్ ప్ర‌ముఖులు కూడా దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు.

46 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయిన పునీత్ రాజ్ కుమార్ (Puneet Rajkumar) తీర‌ని బాధ‌ని మిగిల్చాడు. ఆయ‌న పార్థీవదేహాన్ని నిన్న సాయంత్రం ఇంటికి తరలించారు. అక్కడి నుంచి అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంకు (kanteerava stadium) తీసుకెళ్లారు. ఆయన భౌతిక కాయాన్ని చివరిసారిగా చూసి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. 

Also Read : Puneeth Ramkumar's last rites: పునీత్ చివ చూపు కోసం బెంగళూరుకు టాలీవుడ్ అగ్ర హీరోలు

ఇక పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంతో బాలయ్యకు మంచి అనుబంధం ఉంది. తనకెంతో ఆప్తుడైన పునీత్‌ రాజ్‌కుమార్ మరణంతో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బాల‌కృష్ణ .. పునీత్ పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు. కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్‌కుమార్ మృతదేహాన్ని చూడగానే బాలయ్య కన్నీరుపెట్టుకున్నారు. పునీత్ అన్నయ్య శివరాజ్ కుమార్‌ను (Shivaraj Kumar‌) ఓదారుస్తూ కన్నీరు పెట్టుకున్న నందమూరి బాలకృష్ణ.. కాసేపు అక్కడే ఉండిపోయారు. బాలయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని అదిమి పెడుతూ పక్కకి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చాడు. పునీత్ (Puneet Rajkumar)మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని బాలకృష్ణ అన్నారు.

Also Read : RRR Movie Update: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి సర్‌ప్రైజ్‌.. మూవీ గ్లింప్స్ విడుదల తేదీ ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News