Bharateeyudu 2: కమల్ హాసన్ సినిమా రిలీజ్ ఇంత సైలెంట్ గానా? బాధలో ఉన్న ఫ్యాన్స్

Kamal Haasan Indian 2 Release Date: స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 సినిమా త్వరలో విడుదల కూడా కాబోతుంది. కానీ ఇంకా సినిమా ప్రమోషన్స్ మొదలు కూడా కాలేదు…  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 4, 2024, 10:20 AM IST
Bharateeyudu 2: కమల్ హాసన్ సినిమా రిలీజ్ ఇంత సైలెంట్ గానా? బాధలో ఉన్న ఫ్యాన్స్

Indian 2: లోకనాయకుడు కమల్ హాసన్ స్టార్ డైరెక్టర్ శంకర్.. కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా భారతీయుడు2. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జూన్ 13న థియేటర్లలో విడుదలకి సిద్ధం అవుతోంది. సినిమా విడుదలకి ఇంకా 40 రోజులు మాత్రమే సమయం ఉంది. కానీ ఇలాంటి సమయంలో కూడా చిత్రబృందం నిమ్మకు నీరెత్తినట్టు సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టకుండా కూర్చోవడం ఫ్యాన్స్ ని సైతం షాక్ కి గురిచేస్తోంది.

నిజానికి చిత్రబృందం సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. రామ్ చరణ్, రజినీకాంత్ లను గెస్ట్లుగా కూడా రావడానికి ఆహ్వానం పంపింది. కానీ అసలు అది ఎప్పుడు ఉంటుందో ఎవరికీ తెలియదు. మరోవైపు శంకర్ వల్లే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతున్నాయని తెలుస్తోంది. మిగతా స్టార్ హీరోలు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా గురించి అభిమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు. దానికి కారణం శంకర్ ఈ సినిమాకి సంబంధించిన ఏ విషయాన్ని తేల్చకపోవడం. ఈ చిత్రం మొదటి భాగం సాధించిన బ్లాక్ బస్టర్ కి.. ఈ సినిమాని కానీ సరైన లెవెల్లో ప్రమోట్ చేస్తే.. ఈ సినిమా నుంచి వేరుగా ఉంటుంది..కాని శంకర్ ఎందుకో అలా చేయడం లేదు.

సినిమాకి సంబంధించిన కొంత ప్యాచ్ వర్క్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. కాబట్టి సినిమా అసలు అనుకున్న తేదీకి విడుదల అవుతుందా లేక వాయిదా పడుతుందో అని కూడా ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. మరోవైపు సినిమాని ఎలాగైనా పూర్తి చేసి విడుదల చెయ్యాలన్నా.. ఇక ఉన్న తక్కువ రోజుల గ్యాప్  లోపల చాలా స్ట్రాంగ్ గా ప్రమోషన్లు చేయాల్సిఉంటుంది. కనీసం ఇప్పటినుంచి అయినా ప్రమోషన్ పనులు మొదలుపెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే ఇది గమనించి..ఇప్పటికైనా కమల్ హాసన్, శంకర్ కలిసి సినిమా కోసం రంగంలోకి దిగాలని.. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 

అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి..శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ పనులను చూసుకుంటున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జయంట్ మూవీస్ వారు ఈ సినిమాని భారీబడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నడుముడి వేణు, సిద్ధార్థ, రకుల్ ప్రీత్, గుల్షన్ గ్రోవర్, ప్రియా భవాని శంకర్, వివేక్, జయప్రకాష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: Harish Rao: రేవంత్‌ రెడ్డికి ఏడుపాయల దుర్గమ్మ ఉసురు తగులుతుంది: హరీశ్‌ రావు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News