Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమాలో మహా భారత కాలం నుంచి భవిష్యత్తు 2898లో ప్రపంచం ఎలా ఉండబోతుందో తన ఊహాజనితంగా తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ సినిమా నేపాలీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతోంది. అక్కడ ఈ సినిమా తాజాగా రూ. 23 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి గతంలో ప్రభాస్ నటించిన ‘బాహుబలి 2’ రికార్డును క్రాస్ చేసింది. ఏడేళ్ల క్రితం రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి 2’ అక్కడ బాక్సాఫీస్ దగ్గర రూ. 23 కోట్ల గ్రాస్ వసూల్లతో టాప్ లో నిలిచింది.
ఆ తర్వాత విడుదలైన మరే భారతీయ చిత్రం అక్కడ ఈ రేంజ్ వసూళ్లను అందుకోలేకపోయింది. తాజాగా ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నేపాలీ బాక్సాఫీస్ దగ్గర రూ. 23 కోట్ల గ్రాస్ వసూళ్లను క్రాస్ చేసి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మొత్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. రూ. 1175 కోట్ల గ్రాస్ (రూ. 570 కోట్ల షేర్) రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 160 కోట్లకు పైగా లాభాలతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
ఇక కల్కి ఓటీటీ విషయానికొస్తే.. ఈ సినిమాను ఆగష్టు 15 నుంచి అమెజాన్ ప్రైమ్ లో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘కల్కి’ రెండో పార్ట్ వచ్చే యేడాది మే 9న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే సెకండ్ పార్ట్ తో పాటు మూడో పార్ట్ కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తైయింది. కొంత ప్యాచ్ వర్క్ చేస్తే సరిపోతుంది. మరోవైపు ప్రభాస్ ఈ యేడాది మంచు విష్ణు హీరోగా నటిస్తూన్న ‘కన్నప్ప’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్.. మహా శివుడిగా కనిపించబోతున్నాడా అనేది చూడాలి. మరోవైపు ప్రభాస్.. సలార్ పార్ట్ 2 షూటింగ్ పూర్తి చేయనున్నాడు. అటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ తో పాటు హను రాఘవపూడితో చేయబోతున్న ‘ఫౌజీ’ని నేతాజీకి సంబంధించి ఆజాద్ హిందూ ఫౌజ్ నేపథ్యంలో తెరకెక్కనుంది. అటు మారుతి దర్శకత్వంలో చేస్తోన్న ‘ది రాజాసాబ్’ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. అటు సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ తో కూడా ఓ సినిమా కూడా లైన్ లో ఉంది.
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter