Kalki 2898 AD Trailer: ‘కల్కి 2898 AD’ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్.. అఫీషియల్ ప్రకటన..

Kalki 2898 AD Trailer: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా  అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో దీపికా పదుకొణే కథానాయికగా నటించిన మూవీ ‘కల్కి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 7, 2024, 04:04 PM IST
Kalki 2898 AD Trailer: ‘కల్కి 2898 AD’ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్.. అఫీషియల్ ప్రకటన..

Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ వరుస సినిమాలతో దుమ్ము రేపుతున్నాడు. గతేడాది ఆదిపురుష్, సలార్ సినిమాలతో అభిమానులను అలరించిన రెబల్ స్టార్.. త్వరలో ‘కల్కి 2898 AD’ మూవీతో పలకరించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా విడుదలైన బుజ్జి వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కు దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్కి మూవీ ట్రైలర్ ను ఈ నెల 10న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. నాగ్ అశ్విన్ ఈ సినిమా కోసం దాదాపు నాలుగేళ్లుగా కష్టపడ్డాడు. షూటింగ్ కోసం మరో మూడేళ్లు కష్టపడ్డాడు.

ఈ నెల 27న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. త్వరలో సెన్సార్ కు వెళ్లనుంది. ఈ సినిమాను టైమ్ మిషన్ నేపథ్యంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మహా భారతం నుంచి 6 వేల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించనున్నాడు. ప్రభాస్ ఈ సినిమాలో ‘భైరవ’ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా అన్ని ఏరియాల్లో బిజినెస్ పూర్తి అయింది. ఇప్పటికే కర్ణాటకలో ఈ సినిమా రైట్స్ రూ. 25 కోట్ల బిజినెస్ చేసినట్టు సమాచారం.

అంతేకాదు తెలుగులో రూ. 160 కోట్ల బిజినెస్.. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 340 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఏపీ, తెలంగాణల్లో ఒక వారం రోజులు పాటు టిక్కెట్ రేట్స్ పెంచుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించనున్నారు.  ఈ సినిమా తర్వాత ప్రభాస్.. తన చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్స్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ మూవీ తర్వాత ‘సలార్ పార్ట్ -2, ది రాజా సాబ్ సినిమాలను పూర్తి చేయనున్నాడు. అటు మంచు విష్ణు కన్నప్ప మూవీ ఈ యేడాదే విడుదల కాబోతుంది. మరోవైపు హను రాఘవపూడి, సిద్ధార్ధ్ ఆనంద్ సినిమాలు లైన్ లో ఉన్నాయి.

Rear more: Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News