NTR Viral Video::జూనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానించేవారు ఎంతోమంది. అద్భుతమైన డైలాగ్ డెలివరీ, నటన.. అన్నిటికన్నా మించిన సూపర్ డాన్స్ తో తనకంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ హీరో. ఇక ఈ హీరో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కూడా స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం వివిధ దేశాలలో మన జూనియర్ ఎన్టీఆర్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ 100 కోట్లు దాటి సూపర్ సక్సెస్ అందుకున్న టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ వెళ్లేటప్పుడు జరిగిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. సోమవారం హైదరాబాద్ లో సిద్దు జొన్నల టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా జరిగింది. ఎన్టీఆర్ వస్తున్నాడు అని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు ఈ ఈవెంట్ కి వచ్చారు. సక్సెస్ మీట్ అనంతరం తిరిగి ఎన్టీఆర్ కారు వద్దకు వెళుతుండగా ఆయన అభిమానులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించినట్లుగా కనిపిస్తోంది.
ఎన్టీఆర్ వెళ్లేటప్పుడు ఆయన్ని చూసేందుకు ఫ్యాన్స్ పోటెత్తారు. వారిని నిలువరించడం బౌన్సర్లకు కూడా చాలా కష్టంగా మారింది. అందరి మధ్యలో తారక్ నలిగిపోయాడు. అంతేకాకుండా ఓ ఫ్యాన్ బౌన్సర్లను దాటుకుని ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి కాళ్ల మీద పడబోయాడు. అసలు ఇసుక వేసినా రాళ్లనంత జనం ఎన్టీఆర్ చుట్టూ కమ్ముకోవటంతో అక్కడ ఉన్నవారు కంట్రోల్ కూడా చేయలేకపోయాడు. ఈ సమయంలో ఎన్టీఆర్ పడిపోబోయాడు కూడా. వెంటనే బౌన్సర్లు తారక్‌ను గట్టిగా పట్టుకున్నారు. మొత్తానికి ఎత్తకేలకి కారు ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ కి గగనంలా మారింది. అయితే అభిమానులు అంత ఇబ్బంది కలిగించిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎంతో ఓపికగా ప్రవర్తించారు.
వారిని ఒక్క మాట కూడా అనకుండా అలానే తన మొహం పైన రవ్వంత కోపం కూడా లేకుండా ఎంతో హుందాగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎన్టీఆర్. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని తెగ ఆకట్టుకుంటుంది. ఇదే ప్లేస్ లో ఇంకో హీరో ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
What if another hero were in #JrNTR's place?
— KLAPBOARD (@klapboardpost) April 11, 2024
Also Read: Lok Sabha Polls: ఎంపీ ఎన్నికలకు రేవంత్ రెడ్డి భారీ వ్యూహం.. అలా నామినేషన్.. ఇలా ప్రచారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter