Payal Ghosh Sensational Comments: ఆ దర్శకుడు నన్ను రేప్ చేశాడు, NTR హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Payal Ghosh Sensational Comments: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు రోజురోజుకూ అధికమౌతున్నాయి. కొందరు అంతా ట్రాష్ అని కొట్టిపారేసినా నిజం ఎప్పటికీ ఆగదు. తాజాగా తమకెదురైన అనుభవాల్ని హీరోయిన్లు షేర్ చేస్తుండటంతో వివాదం ఇంకా కొనసాగుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2023, 10:28 AM IST
Payal Ghosh Sensational Comments: ఆ దర్శకుడు నన్ను రేప్ చేశాడు, NTR హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Payal Ghosh Sensational Comments Director Anurag Kashyap: తెలుగు, హిందీ, తమిళం ఏ భాషా అతీతం కాదు..అన్ని భాషల్లోనూ సాధారణమైపోయింది.. క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. దర్శకులు, నటులపై లైంగికంగా వేధించారనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ బాలీవుడ్ ప్రముఖ దర్శకునిపై చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి.

సినిమా ఇండస్ట్రీనే ఓ వివాదాస్పద ప్రపంచం. ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చే హీరోయిన్ల లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా ప్రాచుర్యం పెరిగే కొద్దీ గతంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల్ని ఏకరువు పెడుతూ హీరోయిన్లు సంచలనం రేపుతున్నారు. తాజాగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఒకప్పటి తారక్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మరెవరో కాదు. తారక్, తమన్నా నటించిన ఊసరవెల్లిలో మరో సహ నటి బెంగాల్ బ్యూటీ పాయల్ ఘోష్. హీరోయిన్‌గా విజయం సాధించలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అదృష్టం పరీక్షించుకోవాలనుకుంది. అక్కడా సక్సెస్ కాలేక సీరియల్స్ చేస్తూ స్థిరపడుతోంది. సినిమాల్లో మాత్రం సరైన అవకాశాలు పొందలేకపోయింది పాయల్ ఘోష్. 

ఇప్పుడీమె బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అనురాగ్ కశ్యప్ లైంగికంగా వేధిస్తున్నాడని కేసు పెట్టింది. తాజాగా పాయల్ ఘోష్ చేసిన మరో ట్వీట్ వైరల్ అవుతోంది. దక్షిణాదిన తాను ఇద్దరు జాతీయ అవార్డులు పొందిన దర్శకులతో పనిచేశానని..తారక్‌తో చేశానని..కానీ వీళ్లంతా జెంటిల్మన్స్ అని కీర్తించింది. ఎప్పుడూ తనతో అసభ్యకరంగా ప్రవర్తించలేదని తెలిపింది. కానీ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను మూడోసారి కలిసినప్పుడే అత్యాచారం చేశాడని చెప్పింది. ఇప్పుడు చెప్పండి మీరు...దక్షిణాది సినిమా ఇండస్ట్రీని ఎందుకు పొగడకూడదు..అంటూ ప్రశ్నించింది. 

ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది. కొంతమంది ఆమెకు మద్దతుగా నిలుస్తుంటే మరి కొంతమంది ప్రచారం కోసం చేస్తోందంటూ విమర్శిస్తున్నారు. దక్షిణాదిలో అవకాశాల కోసమే దక్షిణాది సినీ వ్యక్తుల్ని పొగుడుతోందని మండిపడుతున్నారు. ఇటు దక్షిణాది వ్యక్తులు మాత్రం పాయల్ ఘోష్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

Also Read: No Free Tickets for Team RRR at Oscars: ఆస్కార్ అవార్డ్స్ షో టికెట్స్ కోసం రూ. 1.44 కోట్లు ఖర్చు ?

Also Read: Niharika Konidela Divorce : ఈ ఒక్క ఫోటోను మాత్రం డిలీట్ చేయని చైతన్య.. నిహారికతో విడాకులు కన్ఫామ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News