నందమూరి ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్: బాబాయ్ సినిమాకు ముఖ్య అతిథిగా అబ్బాయ్!

నందమూరి ఫ్యాన్స్ కు పండగలాంటి వార్త. బాబాయ్ బాలయ్య 'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అబ్బాయ్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2021, 01:00 PM IST
నందమూరి ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్: బాబాయ్ సినిమాకు ముఖ్య అతిథిగా అబ్బాయ్!

Akhanda movie: నందమూరి అభిమానులకు శుభవార్త. ఎందుకంటే నందమూరి హీరోలిద్దరూ ఒకే వేదికపై మెరవనున్నారు. నటసింహం బాలకృష్ణ(balakrishna) కొత్త సినిమా 'అఖండ'(akhanda movie). డిసెంబరు 2న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో...నవంబరు 27వ తేదీన ప్రీ రిలీజ్​ ఈవెంట్​(akhanda pre release event) నిర్వహించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే హీరోలు ఎన్టీఆర్(jr ntr ), నాని(Hero Nani)లను ఈవెంట్​కు ఆహ్వానించారట. అందుకు వారిద్దరూ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే  అవకాశం ఉంది. 

గతంలో 'అరవింద సమేత' ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు బాలయ్య(balayya), కల్యాణ్​రామ్​ హాజరయ్యారు. అప్పుడు అబ్బాయి కోసం బాబాయ్ వస్తే.. ఇప్పుడు బాబాయ్​ కోసం అబ్బాయ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.'అఖండ'లో(balakrishna akhanda movie) బాలయ్య రెండు పాత్రల్లో నటించారు. ఆయన సరసన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) హీరోయిన్​గా చేసింది. 

Also Read: బాలకృష్ణ. మహేశ్‌బాబులతో కొరటాల మల్టీస్టారర్‌ మూవీ?

ఈ చిత్రంలో శ్రీకాంత్(Srikanth), జగతిబాబులు కీలకపాత్రలు పోషించారు. తమన్(thaman) సంగీతమందించగా, బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి.. ద్వారకా క్రియేషన్స్​ పతాకంపై నిర్మించారు.మరోవైపు ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో(RRR Movie) జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాని 'శ్యామ్​సింగరాయ్' చిత్రం(shyam singha roy) డిసెంబరు 24న థియేటర్లలో సందడి చేయనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News