RRR Cast Remuneration: RRR సినిమాకు తలో రూ.45 కోట్లు తీసుకున్న హీరోలు .. అలియా రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే!

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటించిన ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ చెరో రూ.45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్‌ రూ.9 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2021, 01:35 PM IST
  • ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు 45 కోట్లు వసూలు చేసిన ఎన్టీఆర్‌
  • 45 కోట్లు వసూలు చేసిన రామ్ చరణ్
  • అలియా భట్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే
RRR Cast Remuneration: RRR సినిమాకు తలో రూ.45 కోట్లు తీసుకున్న హీరోలు .. అలియా రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే!

Alia Bhatt takes around Rs 9 crores for RRR Movie: దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR), మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోలుగా నటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR Movie) చిత్రం.. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న విడుదలవుతోంది. భారీ బడ్జెట్‌తో మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండంతో.. చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేసింది. అయితే ఈ సినిమా కోసం ప్రధాన తారాగణం ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నారో అనే విషయం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

బాలీవుడ్ లైఫ్ రిపోర్ట్ ప్రకారం... ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కొమురం భీమ్‌ పాత్రలో నటించిన ఎన్టీఆర్‌ (NTR) రూ.45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్‌ చరణ్‌ ((Ram Charan)) కూడా రూ.45 కోట్లు వసూలు చేశాడట. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn) 25 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. ఇక సీత పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్‌ (Alia Bhatt) రూ.9 కోట్ల రెమ్యూనరేషన్ (Remuneration) తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. అలియాకు ఇంచుమించు బాలీవుడ్‌లో ఇంతే పారితోషికం అందుతుందని సమాచారం. 

Also Read: Bank Holidays January 2022: జనవరిలో మొత్తం 16 బ్యాంక్ హాలిడేస్​- పూర్తి వివరాలివే..

ఇక స్టార్ డైరెక్టర్‌ అయిన ఎస్‌ఎస్ రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా లాభాలో వాటాను తీసుకుంటున్నాడని తెలుస్తోంది. సినిమా లాభాల్లో 30 శాతం వాటా తీసుకోనున్నాడట. మరోవైపు శ్రియ శరన్, సముద్రఖని కూడా భారీగానే వసూల్ చేశారట. వీరితో పాటు మ్యూజిక్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్, కెమెరా, మేకప్ లాంటి విభాగాలకు కూడా బాగానే ముట్టాయట. సినిమా బడ్జెట్‌లో దాదాపు సగం వరకు రెమ్యునరేషన్‌లకే కేటాయించినట్లు కనిపిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ లాంటి భాషల్లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR Movie) సినిమాపై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సినిమా వాయిదా ప‌డుతున్న‌ట్టు వార్త‌లు వస్తున్నాయి. కరోనా వైరస్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్.. దేశంలో వేగంగా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సినిమా విడుద‌ల‌ను వాయిదా వేయాల‌ని చిత్ర బృందం బావిస్తోందని తెలుస్తోంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎంతవ‌ర‌కూ నిజం ఉందో స్పష్టంగా తెలియదు. ఈ విషయంపై ఇప్పటివరకు చిత్ర బృందం స్పందించలేదు.

Also Read: Best Christmas Greetings: మీ స్నేహితులు, బంధువుల కోసం బెస్ట్ క్రిస్మస్ గ్రీటింగ్ కార్డులు ఇవే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News