Avatar 2 Worldwide Collections జేమ్స్ కెమరాన్ సినిమాలకు ప్రపంచం అంతా అభిమానులే ఉంటారు. ఆయన తెరకెక్కించిన అవతార్ అన్ని రికార్డులను క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ అవతార్ 2తో ఆ రికార్డులను చెరిపేసేందుకు ముందుకు వస్తున్నాడు. రేపు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతోన్నాడు. ఈ చిత్రం చైనాలో కూడా విడుదల అవతుండటంతో బాక్సాఫీస్ లెక్కల్లో చాలానే మార్పులు చోటు చేసుకోబోతోన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అవతార్ 2 మొదటి వీకెండ్‌లోనే $550 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసేలా కనిపిస్తోంది.
ఇక కేవలం అమెరికాలోనే మొదటి వీకెండ్‌లో $175-$200 మిలియన్ డాలర్లను రాబట్టేలా కనిపిస్తోంది. అయితే ఇది 2019లో విడుదలైన అవతార్ కంటే మూడు రెట్లు ఎక్కువ. కేవలం చైనాలోనే ఈ చిత్రం దాదాపు $200 మిలియన్ డాలర్లను రాబట్టేలా కనిపిస్తోంది. అలా ఈ చిత్రం వీకెండ్ మొత్తంలో $350-$400 మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేసే అవకాశం ఉంది.
అదే ఇండియాలో అయితే ఈ చిత్రం అవెంజర్ ఎండ్ గేమ్ రికార్డులను బద్దలు కొట్టేందుకు రెడీగా ఉంది. ఇప్పటి వరకు ఇదే హయ్యస్ట్ కలెక్టెడ్ హాలీవుడ్ మూవీగా ఉంది. ఇది మొదటి రోజు 53 కోట్లు కలెక్ట్ చేయగా.. లాంగ్ రన్‌లో 370 కోట్లు కొల్లగొట్టేసింది. ఇప్పుడు అవతార్ 2 ఈ రికార్డులను చెరిపేసేలా కనిపిస్తోంది.
ఎండ్ గేమ్, అవతార్ ఫస్ట్ పార్ట్ సినిమాలను ఇండియాలో 2845 స్క్రీన్‌లలో రిలీజ్ చేయగా.. ఇప్పుడు అవతార్ పార్ట్ 2ని మూడు వేలకు పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ చేయబోతోన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మొదటి రోజు ఇండియాలో రికార్డ్ కలెక్షన్లను రాబట్టేలా కనిపిస్తోంది. అయితే ఈ సినిమాకు ఇప్పుడు నెగెటివ్ రివ్యూలు వస్తున్నాయి. సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉందని, ఫస్ట్ హాఫ్ అంతా కూడా సోదిలా ఉందని, చివరి గంట మాత్రమే హైలెట్‌గా ఉందని నెటిజన్ల రివ్యూలు వైరల్ అవుతున్నాయి.
Also Read : Kasthuri Shankar Drinking Habit : మందు తాగను, స్నానం చేసేటప్పుడు సబ్బు కూడా పెట్టను : కస్తూరీ శంకర్
Also Read : Sreemukhi New House : కొత్త ఇంట్లోకి శ్రీముఖి.. ఫ్యామిలీ పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook