Jagapathi Babu: నన్ను వాళ్ళు మోసం చేశారు.. ఎవరనేది త్వరలోనే చెబుతాను.. జగపతిబాబు షాకింగ్ కామెంట్స్

Jagapathi Babu Shocking Comments: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫ్యామిలీ హీరో అంటే వెంటనే గుర్తొచ్చే పేరు జగపతిబాబు. ఏమున్నా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు ఈ హీరో. కాగా ప్రస్తుతం జగపతిబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 29, 2024, 10:50 AM IST
Jagapathi Babu: నన్ను వాళ్ళు మోసం చేశారు.. ఎవరనేది త్వరలోనే చెబుతాను.. జగపతిబాబు షాకింగ్ కామెంట్స్

Jagapathi Babu Viral Comments: ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్నారు జగపతిబాబు. అయితే బాలకృష్ణ లెజెండ్ సినిమాతో విలన్ గా కూడా అంతే పేరు తెచ్చుకున్నారు. మొదట్లో సినిమాలలో ఎంతో సాఫ్ట్ గా కనిపించే జగపతిబాబు.. ఇప్పుడు ఎన్టైర్డ్ డిఫరెంట్ గా.. మోస్ట్ వైలెంట్ గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉన్నారు. మొత్తానికి ఎలాంటి పాత్రనైనా తాను చేయగలనని రుజువు చేసుకున్నారు ఈ హీరో.

సినిమాల విషయం పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ లో కూడా జగపతిబాబు పర్ఫెక్ట్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు. అందుకు ముఖ్య కారణం ఏమున్నా కానీ ఆయన ముక్కుసూటిగా మాట్లాడదం. ఎదుటి వ్యక్తి ఎలాంటి వారైనా సరే జగపతిబాబుకి నచ్చితే నచ్చారని.. నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జగపతిబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో జగపతి బాబు ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియోలో జగపతి బాబు మాట్లాడుతూ.. ‘రియల్ ఎస్టేట్ లో మోసాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో ఎన్నోసార్లు హెచ్చరించారు. ఇటీవల నేను ఓ రియల్ ఎస్టేట్ యాడ్ లో నటించాను. కానీ నన్ను వారు మోసం చేశారు. వాళ్ళు అసలు ఎవరు అనేది త్వరలోనే చెప్తాను. ల్యాండ్ కొనేటప్పుడు రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలు మనమందరం తప్పనిసరిగా తెలుసుకొని జాగ్రత్త పడండి. ఎవరి ట్రాప్లో పడొద్దు’ అని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు ఈ నటుడు. దీంతో జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి 

కాగా జగపతి బాబుని మోసం చేసింది ఎవరు అనేది తెలియాలంటే మాత్రం… జగపతిబాబు చెప్పే వరకు వెయిట్ చేయాలి.

Also read: Best Tourist Places: వేసవిలో తిరిగేందుకు బెస్ట్ టూరిస్ట్ ప్రాంతాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News