Jabardasth Ram Prasad : జబర్దస్త్ రాం ప్రసాద్‌కు ఏమైంది?.. అలా ఎందుకు కనిపించాడు.. పిక్స్ వైరల్‌

Jabardasth Ram Prasad Hair Transplant జబర్దస్త్ రాం ప్రసాద్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తన జుట్టును కవర్ చేసుకున్న ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది. గాలోడు సినిమా సక్సెస్ అవ్వడంతో సుధీర్, శ్రీను, రాం ప్రసాద్ కలిసి సెలెబ్రేషన్స్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2022, 07:49 AM IST
  • సుడిగాలి సుధీర్ గాలోడు హవా
  • సంబరాలు చేసుకున్న మిత్రత్రయం
  • జబర్దస్త్ రాం ప్రసాద్ పిక్ వైరల్
Jabardasth Ram Prasad : జబర్దస్త్ రాం ప్రసాద్‌కు ఏమైంది?.. అలా ఎందుకు కనిపించాడు.. పిక్స్ వైరల్‌

Jabardasth Ram Prasad Hair Transplant : జబర్దస్త్ షోతో ఆటో రాం ప్రసాద్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనుల స్నేహం బలపడింది. ఈ మిత్రత్రయం చేసే కామెడీకి బుల్లితెర ప్రేక్షకులు పడి పడి నవ్వుతుంటారు. అయితే ఈ ముగ్గురూ కలిసి సిల్వర్ స్క్రీన్ మీద చేసిన త్రీమంకీస్ సినిమా దారుణంగా బెడిసి కొట్టేసింది. స్మాల్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేసిన కామెడీని. సిల్వర్ స్క్రీన్ మీద చూడలేకపోయారు ప్రేక్షకులు. జబర్దస్త్ షోలో మాత్రం ఈ ముగ్గురి కాంబినేషన్‌కు మంచి డిమాండ్ ఉంటుంది.

అయితే సుధీర్, శ్రీను ఇప్పుడు ఎక్కువగా సినిమాలతో బిజీగా ఉంటోన్నారు. పైగా ఇప్పుడు సుధీర్ గాలోడు అంటూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. కెరీర్‌లో మొదటి సారిగా మంచి హిట్ కొట్టేశాడు సుధీర్. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీమంకీస్ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఈ గాలోడు రొటీన్ రాడ్డు సినిమా అయినా కూడా కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయట. నిన్నటితో బ్రేక్ ఈవెన్ అయినట్టు తెలుస్తోంది. ఇకపై గాలోడు లాభాల బాట పట్టనుందని నిన్నటి సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో చెప్పేశారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jabardasth Ram Prasad (@jabardasth_ramprasad)

ఇదంతా ఒక వైపు అయితే.. ఇప్పుడు సుధీర్, శ్రీను, రాం ప్రసాద్ ముగ్గురూ కలిసి ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. సుధీర్ ఇంటికి వెళ్లి.. ఈ సినిమా సక్సెస్‌ను సెలెబ్రేట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో ముగ్గురూ దోస్తులు తెగ నవ్వులు చిందిస్తోన్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అందరూ కూడా రాం ప్రసాద్ మీద ఫోకస్ పెట్టేశారు. రాం ప్రసాద్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో నెటిజన్లు రాం ప్రసాద్ జుట్టు గురించే మాట్లాడుకుంటున్నారు.

బుల్లితెరపై రాం ప్రసాద్ కామెడీ, రైటింగ్ అన్నీ కూడా బాగానే క్లిక్ అయ్యాయి. సినిమాలకు కూడా రాం ప్రసాద్ రైటర్‌గా పని చేస్తుంటాడన్న సంగతి తెలిసిందే. వెండితెర, బుల్లితెర అంటూ శ్రీను, సుధీర్, రాం ప్రసాద్ ముగ్గురూ ఫుల్ బిజీగానే ఉంటున్నారు.

Also Read : Sudigali Sudheer Gaalodu : గాలోడు చించేసే కథేమి కాదు.. సినిమా చూసాక నాకు బాధేసింది.. తమ్మారెడ్డి భరద్వాజ  

Also Read : Vishwak Sen : నక్కతోక తొక్కిన విశ్వక్ సేన్.. ఏకంగా 'సితార'తో సినిమా ఫిక్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News