Chiranjeevi: ఆ విషయంలో టెన్షన్ పడుతున్న మెగా అభిమానులు

Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆచార్య. సోషల్ ఎలిమెంట్స్  ఉన్న చిత్రాలు తెరకెక్కించే కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. 

Last Updated : Nov 30, 2020, 11:01 PM IST
    1. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆచార్య.
    2. సోషల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలు తెరకెక్కించే కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
Chiranjeevi: ఆ విషయంలో టెన్షన్ పడుతున్న మెగా అభిమానులు

Chiranjeevi Next Film | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆచార్య. సోషల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలు తెరకెక్కించే కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. రాజకీయాల నుంచి దూరం అయ్యాక చిరంజీవి వరుసగా భారీ చిత్రాల్లో నటించడానికి ఫిక్సయ్యారు. అందులో బాగంగా ప్రస్తుతం వరుసగా సినిమాలకు ఓకే అంటున్నారు. అదే కోవలో వస్తున్న ఆచార్య చిత్రం తరువాత మలయాళంలో విజయం సాధించిన లూసిఫర్ చిత్రం తెలుగు వర్షన్‌లో నటించడానికి సిద్ధం అయ్యారు మెగాస్టార్. 

 

Also Read | KGF దర్శకుడితో ప్రభాస్ మూవీ.. త్వరలో అధికారికంగా వెల్లడి!

మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ మూవీ తెలుగు రీమేక్ రైట్స్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సొంతం చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ మూవీకి దర్శకుడిగా ఎవరిని ఎంచుకోవాలి అనేది నిర్ణయించడంలోనే కాస్త ఆలస్యం జరగుతోందట.

Also Read | ఈ దేవత ఎంతం అందంగా ఉందో...నయనతార చీరపై చర్చలు చేస్తున్న నెటిజెన్స్

నిన్నా మొన్నటి వరకు వివి వినాయక్‌కు (VV Vinayak) దర్శకత్వ బాధ్యతలు అప్పగించే విషయం గురించి వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం మోహన్ రాజాకు అప్పగించగా.. ప్రాజెక్టు ముందుకు కదలడం లేదట. అయితే స్క్రిప్ట్ విషయంలో మాత్రం చిరంజీవి (Chiranjeevi) అంత హ్యాప్పీగా లేదట. దాంతో చిరంజీవి ఫ్యాన్స్ అంచనాల మేరకు కొత్తగా స్క్రిప్ట్ మళ్లీ సిద్ధం చేస్తున్నాడట. ఇదంతా తెలుసుకున్న ఫ్యాన్స్ లూసిఫర్ రీమేక్ మరింత ఆలస్యం అవుతుందేమో అని టెన్షన్ పడుతున్నారట.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News