Samantha Sreeshanth: సమంతతో ఆడిపాడనున్న టీమిండియా క్రికెటర్!!

Samantha - S Sreeshanth: సమంత, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ తాజా చిత్రం 'కాతువాకుల రెండు కాదల్‌'లో వెటరన్ టీమిండియా క్రికెటర్ ఎస్ శ్రీశాంత్‌ నటిస్తున్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2022, 07:01 PM IST
  • సమంతతో ఆడిపాడనున్న టీమిండియా క్రికెటర్
  • మహ్మద్‌ మోబీ పాత్రలో శ్రీ
  • మరో రెండు సినిమాల్లో శ్రీశాంత్‌
Samantha Sreeshanth: సమంతతో ఆడిపాడనున్న టీమిండియా క్రికెటర్!!

Indian Cricketer S Sreesanth to act with Samantha: టాలీవుడ్‌ స్టార్‌ హీరోయన్‌ సమంత, లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ తాజా చిత్రం 'కాతువాకుల రెండు కాదల్‌'. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్‌ సేతుపతి కథానాయకుడుగా నటిస్తున్నాడు. నయనతార ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. సమ్మర్ కానుకగా 'కాతువాకుల రెండు కాదల్‌' సినిమాను విడుదల చేస్తున్నామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.

ఇప్పటికే 'కాతువాకుల రెండు కాదల్' సినిమా నుంచి సమంత, నయనతార, విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్‌లను రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. అది మరెవరిదో కాదు.. వెటరన్ టీమిండియా క్రికెటర్ ఎస్ శ్రీశాంత్‌ది. కోట్, గాగుల్స్ పెట్టుకుని శ్రీశాంత్ ఉన్నాడు. ఈ సినిమాలో శ్రీశాంత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడట. మహ్మద్‌ మోబీ అనే పాత్రలో శ్రీ కనిపించనున్నాడని సమాచారం. అంతేకాదు సమంత సరసన టీమిండియా క్రికెటర్ పలు సన్నివేశాల్లో ఆడిపాడనున్నాడని వార్తలు వస్తున్నాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

శ్రీశాంత్ గతంలోనే ఒక సినిమాలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా 'కాతువాకుల రెండు కాదల్' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. హీరోగా పరిచమైన సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేదు. అందుకే మరోసారి నటుడిగా నిరూపించుకోవాలని ఎదురు చూస్తున్న శ్రీశాంత్‌కు ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు. ఇదే కాకుండా శ్రీశాంత్ మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడని సమాచారం.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rowdy Pictures (@therowdypictures)

ఎస్ శ్రీశాంత్‌ భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 87, వన్డేల్లో 75, టీ20ల్లో 7 వికెట్లు తీసాడు. చివరిగా 2011లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్టులో శ్రీశాంత్‌ ఉన్నాడు. 2013 ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో టీమిండియాకు దూరమైన శ్రీపై ఆరేళ్ల నిషేధం 2020 ఆగస్టులో ముగిసింది. ఐపీఎల్ 2021 కోసం తన పేరు నమోదుచేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. అయినా కూడా ఐపీఎల్ 2022 వేలం కోసం అతడు ఆశగా ఎదురుచూస్తున్నాడు.

Also Read: Ratan Tata: రతన్‌ టాటాను 'ఛోటూ' అన్న అమ్మాయి.. వ్యాపార దిగ్గజం ఏం రిప్లై ఇచ్చారో తెలుసా?

Also Read:  Mahesh Babu: 'సర్కారు వారి పాట'లో మహేష్ చిన్నప్పటి క్యారెక్టర్‌లో ఎవరు నటించారో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News