Idhe Maa Katha trailer: ఇదే మా కథ ట్రైలర్‌ రిలీజ్.. ట్రావెలర్స్‌గా అదగొట్టిన శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌, భూమిక

Idhe Maa Katha Trailer out: మన కోరికలో నిజాయతీ ఉంటే ఎప్పటికైనా అది నెరవేరుతుంది.. అని ‘ఇదే మా కథ’ సినిమా ట్రైలర్‌లో శ్రీకాంత్‌ చెప్పే డైలాగ్‌ ఆసక్తికరంగా ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2021, 05:15 PM IST
  • ఇదే మా కథ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేసిన డైరెక్టర్‌‌ రామ్‌గోపాల్‌ వర్మ
  • హైదరాబాద్‌ నుంచి లద్దాఖ్‌ వరకు సాగే ప్రయాణం నేపథ్యంలో మూవీ
  • బైక్‌ రైడింగ్‌ని ఇష్టపడే పాత్రల్లో సుమంత్‌ అశ్విన్‌-భూమిక
Idhe Maa Katha trailer: ఇదే మా కథ ట్రైలర్‌ రిలీజ్.. ట్రావెలర్స్‌గా అదగొట్టిన శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌, భూమిక

Idhe Maa Katha Trailer unveiled: సుమంత్‌ అశ్విన్‌, భూమిక, తాన్య హోప్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇదే మా కథ’ (Idhe Maa Katha). ట్రావెలింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి గురుపవన్‌ దర్శకత్వం వహించారు. అక్టోబర్‌ 2న ఈ మూవీ రిలీజ్‌ కానుంది. ‘ఇదే మా కథ’ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్‌‌ రామ్‌గోపాల్‌ వర్మ (ram gopal varma) తాజాగా సోషల్‌మీడియా వేదికగా రిలీజ్‌ చేశారు. హైదరాబాద్‌ నుంచి లద్దాఖ్‌ వరకు సాగే ప్రయాణం నేపథ్యంలో సాగుతోంది ఈ మూవీ. పాతికేళ్ల క్రితం దూరమైన ప్రేమను తిరిగి పొందడానికి లద్దాఖ్‌ వెళ్లే ట్రావెలర్‌గా శ్రీకాంత్‌ (srikanth) కనిపించనున్నాడు.

Also Read : Actress Soujanya Suicide: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం... నటి సౌజన్య ఆత్మహత్య

అయితే ట్రైలర్‌‌లో శ్రీకాంత్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. "మన కష్టానికి కారణం మనిషైతే ద్వేషిస్తాం.. దేవుడైతే విధిరాత అనుకుంటాం. మన కోరికలో నిజాయతీ ఉంటే ఎప్పటికైనా అది నెరవేరుతుంది" అని ‘ఇదే మా కథ’ సినిమా ట్రైలర్‌లో శ్రీకాంత్‌ (srikanth) చెప్పే డైలాగ్‌ ఆసక్తికరంగా ఉంది. ఇక సుమంత్‌ అశ్విన్‌-భూమిక (sumanth ashwin‌‌- bhoomika) బైక్‌ రైడింగ్‌ని ఇష్టపడే పాత్రల్లో నటించారు ఈ మూవీలో.

 

Also Read : మేఘాలయలో ఘోరం..నదిలో పడ్డ బస్సు..ఆరుగురు దుర్మరణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News