Allu Arjun- Rajamouli: బన్నీతో రాజమౌళి మూవీ.. సినీ వర్గాల్లో హాట్​ టాపిక్​

Allu Arjun-Rajamouli: దర్శక ధీరుడు రాజమౌలి త్వరలో మహేశ్​ బాబుతో ఓ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత బన్నీతో కూడా రాజమౌళి సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2022, 07:47 PM IST
  • అల్లు అర్జున్ తర్వాతి సినిమాపై క్రేజీ అప్​డేట్​
  • రాజమౌలి దర్శకత్వంలో నటించే అవకాశం
  • మహేశ్​ బాబు సినిమా తర్వాత వీరిద్దరి కాంబో!
Allu Arjun- Rajamouli: బన్నీతో రాజమౌళి మూవీ.. సినీ వర్గాల్లో హాట్​ టాపిక్​

Allu Arjun-Rajamouli: పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్​గా ఎదిగిన అల్లు అర్జున్ తదుపరి సినిమా ఎవరితో అనే విషయంపై ఇప్పుడు విపరీతంగా చర్చ సాగుతోంది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో గానీ.. లేదా వచ్చే ఏడాది ఆరంభంలోగానీ విడుదలయ్యే అవకాశముంది.

అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న బన్నీ తదుపరి సినిమా ఎవరితో తీస్తాడనే విషయంపై ఇంత వరకు స్పష్టమైన ప్రకటన లేదు. కానీ టాప్​ డైరెక్టర్ల సినిమాలు క్యూలో ఉన్నట్లు మాత్రం తెలుస్తోంది.

తాజాగా అల్లు అర్జున్​- దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి తీసిన 'ఆర్​ఆర్​ఆర్​' త్వరలో విడుదల కానుంది. అయితే రాజమౌలి ఇప్పటికే మహేశ్ బాబుతో ఓ సినిమా చేయనున్నట్లు అధికారికంగా వెళ్లడైంది. దీనితో మహేశ్​-రాజమౌళి కాంబోలో మూవీ పూర్తయిన తర్వాతే బన్నీతో సినిమా చేసే అవకాశాలున్నాయనేది సిని వర్గాల నుంచి వినిపిస్తున్న విషయం.

ఇదిలా ఉండగా.. బన్నీ కూడా బాలీవిడ్​ దర్శకత దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీతో ఓ సినిమా చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇటీవల ఆయన ఆఫీస్​కు బన్నీ స్వయంగా వెళ్లి కలవడం ఇందుకు ఊతమిస్తోంది. అయితే ఇది సినిమా కోసమేనా? అనేది తెలియరాలేదు. మొత్తానికి బన్నీ మాత్రం మరో క్రేజీ ప్రాజెక్టుతో రానున్నాడనేది మాత్రం నిజం. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.

Also read: Ananya Pandey Photos: సన్ సెట్ లో సముద్రపు ఒడ్డున రౌడీ హీరోయిన్ హల్ చల్!!

Also read: Prabhs-Maruthi Combo: ప్రభాస్ తో జతకట్టనున్న బేబమ్మ..?? ప్రభాస్ - మారుతి కాంబోలో ఛాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News