Hyper Aadi : ప్రియమణి, అనసూయలు అయిపోయారు.. శ్రద్దా దాస్ మీద పడ్డాడు!.. హైపర్ ఆది మామూలోడు కాదు

Hyper Aadi with Shraddha Das హైపర్ ఆది శ్రద్దా దాస్‌ మధ్య ట్రాక్ క్రియేట్ చేయాలని ఢీ టీం బాగానే ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. దీనికి శ్రద్దా దాస్ కూడా సహకరిస్తున్నట్టుగా ఉంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో శ్రద్దా దాస్ ఆది కోసం ఏకంగా పాట పాడేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2023, 08:49 AM IST
  • బుల్లితెరపై హైపర్ ఆది సందడి
  • రొమాంటిక్ ట్రాక్‌ల మీదే ఆది ఫోకస్
  • శ్రద్దా దాస్‌కు లవ్యూ చెప్పిన ఆది
Hyper Aadi : ప్రియమణి, అనసూయలు అయిపోయారు.. శ్రద్దా దాస్ మీద పడ్డాడు!.. హైపర్ ఆది మామూలోడు కాదు

Hyper Aadi with Shraddha Das బుల్లితెరపై హైపర్ ఆది చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పంచ్‌లు, ప్రాసలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే ఆది ఎప్పుడూ ఎవరో ఒకరితో రొమాంటిక్ ట్రాక్, లవ్ ట్రాక్ నడిపించాలని చూస్తుంటాడు. తన రాసుకునే స్క్రిప్టులే కాబట్టి.. తనకు నచ్చినవారితో ట్రాక్ సెట్ చేసుకుంటాడనిపిస్తుంది. అవి జనాలకు కూడా బాగానే కనెక్ట్ అవుతుండటంతో ఆది రెచ్చిపోతూ ఉంటాడు.

మొదట్లో జబర్దస్త్ షోలో అనసూయతో ట్రాక్ నడిపించాడు. అనసూయ మీద కోరిక ఉన్నట్టుగానే స్కిట్లలో డైలాగ్స్ పేల్చే వాడు. తనకు పెళ్లి అయిందని, భర్త ఉందని అనసూయతో డైలాగ్స్ చెప్పిస్తూనే ఆది మాత్రం తనర కోరికలను బయటపెట్టేవాడు. హగ్గులు, కిస్సుల కోసం స్కిట్లలో సీన్లు కూడా రాసుకుంటూ ఉండేవాడు. అయితే అదంతా సరదాకే అని తెలిసినా కూడా వారిద్దరి కెమిస్ట్రీ బాగుండటంతో జనాలు కూడా ఎంజాయ్ చేసేవారు.

ఆ తరువాత ఆది ఢీ షోలో ప్రియమణితో నానా హంగామా చేసేవాడు. ఆదిని ప్రియమణి బావా అని పిలిచేది. అలా ఈ ఇద్దరి చేష్టలు అయితే జనాలను విసిగెత్తించాయి. ప్రియమణితో హగ్గులు, ముద్దులు అంటూ ఆది హంగామా చేస్తుండేవాడు. అయితే ఇప్పుడు శ్రద్దా దాస్‌ మీద ఆది తన  ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ఢీ ప్రోమోలో ఆదిని పాట పాడేసి పడగొట్టేసింది శ్రద్దా దాస్.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News