Trolls on Karuna Bhushan: తల్లిని అలా అంటే ఊరుకుంటావా? ఏం మెసేజ్ ఇద్దామని?..కరుణను ఒక రేంజ్లో ఆడుకుంటున్న నెటిజన్లు!

Trolls on Karuna Bhushan's Latest Interview: కరుణ భూషణ్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా తన కొడుకుతో పాటు మాట్లాడుతూ కనిపించారు, అయితే తన గురించి బాబు సెక్సీగా ఉన్నావని కామెంట్ చేస్తూ ఉంటాడని చెప్పడంతో పెద్ద ఎత్తున ట్రోల్స్ వినిపిస్తున్నాయి.   

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 17, 2023, 08:09 PM IST
Trolls on Karuna Bhushan: తల్లిని అలా అంటే ఊరుకుంటావా? ఏం మెసేజ్ ఇద్దామని?..కరుణను ఒక రేంజ్లో ఆడుకుంటున్న నెటిజన్లు!

Huge Trolls on Karuna Bhushan's Son Comments: కరుణ భూషణ్ అనేది తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. గతంలో సినిమాల్లో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలు, హీరోయిన్ సోదరి పాత్రలలో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతానికి టీవీ రంగానికి షిఫ్ట్ అయి టీవీ సీరియల్స్ చేసుకుంటూ ఉంది. ప్రస్తుతానికి ఆమె చేస్తున్న వైదేహి పరిణయం అనే సీరియల్ సూపర్ హిట్ గా నడుస్తోంది. కరుణ తన భర్త భూషణ్ ను వివాహం చేసుకొని కరుణ భూషణ్ గా మారింది. అయితే ఈమధ్య యూట్యూబ్ ఛానల్స్ కంటెంట్ కోసం రకరకాల వ్యక్తులను ఇంటర్వ్యూలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఆమెను కూడా ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా కరుణ భూషణ్ కొడుకు కూడా ఆమెతో పాటు మాట్లాడుతూ కనిపించారు. ఈ సమయంలో ఆమె కొడుకు చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు ఆమె మీద ఆమె కుమారుడు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో కొడుకు కూడా పక్కనే ఉండడంతో మీ మదర్ ఎలా ఉంటారు? మీ మదర్ బావుంటారా? ఫాదర్ బాగుంటారా? అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ప్రశ్నిస్తే ఇద్దరూ బాగానే ఉంటారు అని ఆయన సమాధానం ఇచ్చాడు. అయితే ఈ సందర్భంగా కరుణ మాట్లాడుతూ తామిద్దరం మంచి స్నేహితులలా ఉంటామని చెప్పుకొచ్చింది.

ఇదీ చదవండి: Rajamouli Marriage: మా అమ్మను పెళ్లి చేసుకోవడానికి ముందే మా ఇంటికి వచ్చేవాడు..రాజమౌళి సీక్రెట్స్ బయటపెట్టిన కొడుకు!

అంతేకాక తాను బాగా రెడీ అయినప్పుడు కాంప్లిమెంట్స్ కూడా ఇస్తాడని, ఏది ఒకసారి చెప్పు అంటూ ఆమె కామెంట్ చేసింది. వెంటనే ఆమె కుమారుడు ఏమి మాట్లాడలేదు కానీ కరుణ మళ్ళీ మాట్లాడుతూ తాను అందంగా రెడీ అయితే అమ్మ యు ఆర్ బ్యూటిఫుల్ అంటాడని మరింత హాట్ గా రెడీ అయితే యు ఆర్ సెక్సీ అంటాడని చెప్పుకొచ్చింది. ఈ దెబ్బకి యాంకర్ షాక్ అవుతూ చూడగా అందులో తప్పేమీ లేదు మీ ఇద్దరం స్నేహితుల్లాగా ఉంటాం ఏదైనా ముఖం మీద చెప్పేయమని అంటాను అందుకే వాడు తన ఒపీనియన్ ఇలా వ్యక్తం చేస్తాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

అయితే ఇది వారి వ్యక్తిగతం కాబట్టి వ్యక్తిగతంగా ఉంచితే పరవాలేదు కానీ ఇలా సోషల్ మీడియా ద్వారా బయట పెట్టడంతో పలువురు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలా ఎలా కొడుకు సెక్సీగా ఉన్నావు అంటే దాని డైజెస్ట్ ఎలా చేసుకుంటున్నారు? అయినా పిల్లలను పెంచే పద్ధతి అదేనా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అలాగే తల్లి కుమారుడిని పద్ధతితో పెంచినప్పుడే సమాజంలో వ్యక్తులతో ఎలా మెలగాలో తెలుస్తుందని వేరే అమ్మాయిల దగ్గరకు లేక వేరే మహిళల దగ్గరకు వెళ్లి వారిని కూడా ఇలా సెక్సీ అంటూ కామెంట్ చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ విషయం కరుణ భూషన్ వరకు వెళ్లిందో లేదో తెలియదు కానీ గత రెండు మూడు రోజులుగా ఆమెను మాత్రం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. తెలియకపోతే, తెలుసుకోవాలి కానీ ఇలాంటి పద్ధతిలో పెంచడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆమెకు సూచనలు ఇస్తున్నారు. 

ఇదీ చదవండి: Naa Peru Mukesh: నా పేరు ముఖేష్ రియల్ స్టోరీ ఏంటో తెలుసా? ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News