Fighter trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న హృతిక్ 'ఫైటర్' ట్రైలర్‌.. గాల్లో యాక్షన్ అదిరింది..

Fighter trailer: హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా నటించిన చిత్రం 'స్పిరిట్‌ ఆఫ్‌ ఫైటర్'. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఎలా ఉందంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2024, 01:52 PM IST
Fighter trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న హృతిక్ 'ఫైటర్' ట్రైలర్‌.. గాల్లో యాక్షన్ అదిరింది..

Fighter trailer Out: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan)‌ నయా మూవీ 'స్పిరిట్‌ ఆఫ్‌ ఫైటర్' ‌(Spirit Of Fighter). సిద్దార్థ్‌ ఆనంద్ డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీలో అనిల్‌ కపూర్‌, దీపికా పదుకొనే (Deepika Padukone) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫైటర్‌ మూవీ 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ ఆడియెన్స్ లో వీరలెవల్లో అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. పాక్ చేసిన దాడికి భారత్ బదులుతీర్చుకునే కథాంశం నేపథ్యంలో మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ట్రైలర్ విజువల్ వండర్ గా ఉంది. 

స్పిరిట్ ఆఫ్ ఫైటర్‌లో హృతిక్ రోషన్ ఎయిర్ డ్రాగన్స్ విభాగంలో స్క్వాడ్రన్ పైలట్ గా పనిచేసే స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా కనిపించబోతుండగా.. దీపికాపదుకొనే ఎయిర్ డ్రాగన్ యూనిట్‌లో పనిచేసే స్క్వాడ్రన్ లీడర్‌ మిన్నిగా నటిస్తోంది. ఈ మూవీలో కరణ్ సింగ్ గ్రోవర్‌, అక్షయ్‌ ఒబెరాయ్‌, సంజీదా షేఖ్‌, తలత్‌ అజిజ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.. ఈ చిత్రాన్ని వయాకామ్‌ 18 స్టూడియోస్‌-మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వెండి తెరపై హృతిక్ రోషన్, దీపికా పదుకొనే తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అంతేకాకుండా పఠాన్ తర్వాత సిద్దార్థ్‌ ఆనంద్ కాంపౌండ్‌ నుంచి సినిమాపై కావడంతో దీనిపై భారీగానే అంచనాలు ఉన్నాయి. పుల్వామా యాటక్ నేపథ్యంలో ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది. ఏరియల్ యాక్షన్ లో తెరకెక్కుతున్న తొలి భారతీయ సినిమా ఇది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News