Tabu Casting Couch : టబుకి కూడా అలాంటివి తప్పలేదట.. బర్త్ డే స్పెషల్.. నాటి వార్తలు తెరపైకి

Happy Birthday Tabu టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ టబుకి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. నాలుగు పదుల వయసున్నా సరే అందంలో మాత్రం ఇంకా పడుచు పిల్లలానే అనిపిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2022, 08:03 PM IST
  • టబు బర్త్ డే స్పెషల్
  • మీటూపై బోల్డ్ బ్యూటీ టబు
  • జాకీ ష్రాఫ్ మీద టటు కామెంట్స్
Tabu Casting Couch : టబుకి కూడా అలాంటివి తప్పలేదట.. బర్త్ డే స్పెషల్.. నాటి వార్తలు తెరపైకి

Happy Birthday Tabu : సినీ ఇండస్ట్రీలోనే కాదు.. ప్రతీచోటా క్యాస్టింగ్ కౌచ్, మీటూ అనేవి ఉంటాయి. మహిళలపై అన్ని చోట్లా వేధింపులు జరుగుతూనే ఉంటాయి. ఏ స్థాయిలో ఉన్న మహిళకైనా సరే ఏదో ఒక సందర్భంలో ఇలాంటివి తప్పవనేట్టుగా మారిపోయాయి. అయితే సినీ పరిశ్రమ మీద అందరి చూపు ఉంటుంది. కాబట్టే మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అంటే అందరూ సినిమా పరిశ్రమ వైపే వేలు చూపిస్తుంటారు. అయితే తాజాగా టబుకి జరిగిన అలాంటి ఓ ఘటనకు సంబంధించిన విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.

తెలుగులో కూలీ నెంబర్ వన్ సినిమాతో టబు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాలోనే అందాల ఆరబోతతో అందరినీ కట్టిపడేసింది.అలా రాఘవేంద్రరావు హీరోయిన్‌గా టబు తన మార్క్ చూపించింది. నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతోనూ ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసింది. ఇక బాలయ్య, చిరంజీవిలతోనూ సినిమాలు చేసిన ఈ టబు.. ఎక్కువగా బాలీవుడ్‌లోనే ఫేమస్ అయింది.  అయితే టబు మాత్రం ఎప్పుడూ కూడా జాకీ ష్రాఫ్ పక్కన నటించలేదు.

దీని వెనుక ఓ కారణం కూడా ఉందట. ఓ సారి టబు సోదరి పార్టీలో జాకీ ష్రాఫ్ తప్పుగా ప్రవర్తించాడట. తప్ప తాగిన జాకీ ష్రాఫ్‌.. టబుతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడట. కానీ ఆ తరువాత ఓ నటుడు మధ్యలోకి వచ్చి ఆపేశాడట. అయితే దీనిపై ఎవ్వరూ ఎక్కడా నోరు విప్పలేదట. ఈ విషయాల మీద ఇప్పటికీ టబు ఏ కామెంట్ కూడా చేయలేదు. అయితే నేడు టబు బర్త్ డే సందర్భంగా మరోసారి ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.

టబుకి అంధాదున్ అనే సినిమా టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఇందులో గ్లామరస్ విలన్‌గా నటించి బాలీవుడ్‌లో మరోసారి తన సత్తా చాటింది. అయితే ఇప్పుడు టబు ఓటీటీ, సినిమాలు ఇలా అన్నింట్లోనూ బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలోనూ టబు తన ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. టబు షేర్ చేసే హాట్ ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.

Also Read : Acharya TRP Ratings : బాలయ్య, నాగ్, వెంకీల కన్నా దారుణం.. చిరు సినిమా స్థానమిదే

Also Read : Gaalodu Official Trailer : సైలెన్స్, వయలెన్స్ తప్పా నీకేం తెలీదారా?.. దుమ్ములేపేసిన సుడిగాలి సుధీర్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News