Naveen Chandra wife Baby Bump Pic : తండ్రి కాబోతోన్న నవీన్ చంద్ర.. హీరో భార్యను ఎప్పుడైనా చూశారా?.. బేబీ బంప్ పిక్స్ వైరల్

Naveen Chandra wife Baby Bump Pic నవీన్ చంద్ర తాజాగా తన భార్య గర్భంతో ఉన్న విషయాన్ని ప్రకటించాడు. త్వరలోనే తండ్రి కాబోతోన్నట్టుగా గుడ్ న్యూస్ చెబుతూ గాల్లో తేలిపోయాడు. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ పోస్ట్ వేశాడు నవీన్ చంద్ర.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2023, 03:23 PM IST
  • గుడ్ న్యూస్ చెప్పిన నవీన్ చంద్ర
  • తండ్రి కాబోతోన్నట్టుగా ప్రకటించిన హీరో
  • భార్య బేబీ బంప్ పిక్స్ షేర్ చేసిన నవీన్ చంద్ర
Naveen Chandra wife Baby Bump Pic : తండ్రి కాబోతోన్న నవీన్ చంద్ర.. హీరో భార్యను ఎప్పుడైనా చూశారా?.. బేబీ బంప్ పిక్స్ వైరల్

Naveen Chandra wife Baby Bump Pic హీరో నవీన్ చంద్ర త్వరలోనే తండ్రి కాబోతోన్నాడు. ఈ విషయాన్ని నవీన్ చంద్ర స్వయంగా ప్రకటించాడు. తన భార్య ఓర్మా బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్‌ను షేర్ చేసుకున్నాడు. త్వరలోనే తండ్రి కాబోతోన్నట్టుగా, ఎంతో ఆనందంగా ఉందన్నట్టుగా చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆయన చెప్పిన ఈ గుడ్ న్యూస్ తెలిసి అలీ రెజా, ఆకాంక్ష సింగ్ వంటి వారు కంగ్రాట్స్ తెలిపారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Naveen Chandra (@naveenchandra212)

 

బేబీ మూన్.. నా చేతుల్లోకి నిన్ను ఎప్పుడెప్పుడు తీసుకుని ముద్దాడుతానా? అని ఎదురుచూసేందుకు ఆగలేకపోతోన్నాను..  తల్లిదండ్రులం అవుతున్నామనే ఆలోచన ఎంతో గొప్పగా ఉంది.. కొత్త దశ, కొత్త జీవితం, కొత్త ప్రయాణం.. తండ్రిని కాబోతోన్నాను.. ఒర్మా.. ఐ లవ్ యూ.. 2023లోకి స్వాగతం పలుకుతున్నాను అంటూ నవీన్ చంద్ర వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

నవీన్ చంద్ర ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు. అరవింద సమేతలో చేసిన విలన్ రోల్‌, పరంపర వెబ్ సిరీస్‌లో వేసిన పాత్ర ఇలా అన్నీ కూడా మంచి పేరును తీసుకొచ్చాయి. విలన్, సైడ్ కారెక్టర్, హీరో ఇలా అన్ని రకాల పాత్రల్లో నవీన్ చంద్ర మంచి ఆప్షన్‌గా మారాడు. రీసెంట్‌గా రిపీట్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించాడు.

ఇలా నవీన్ చంద్రకు ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇటు ఓటీటీలో వెబ్ సిరీస్‌లు, అటు సినిమాల్లో డిఫరెంట్‌ రోల్స్ అంటూ బిజీగా మారిపోయాడు. ఇప్పుడు ఇలాంటి సమయంలో తండ్రి కాబోతోన్నాడనే వార్త మరింతగా ఆనందాన్ని ఇస్తున్నట్టుగా ఉంది. అయితే నవీన్ చంద్ర మాత్రం ఎప్పుడూ తన ఫ్యామిలీ విషయాలను బయటపెట్టింది లేదు. ఇప్పుడు ఇలా తండ్రిని కాబోతోన్నట్టుగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

Also Read:  manchu Lakshmi at Varanasi : వాలెంటైన్స్ డే.. వారణాసిలో మంచు లక్ష్మీ.. ట్వీట్ వైరల్

Also Read: Supritha Photos : వామ్మో అనిపించేలా సుప్రిత అందాలు.. తల్లితో కలిసి బీచ్‌లో అలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News