Karthikeya Tirumala Visit: తిరుమల శ్రీవారి సేవలో హీరో కార్తికేయ దంపతులు.. ఫొటోలు వైరల్

Karthikeya Tirumala Visit: హీరో కార్తికేయ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన లోహితను వివాహమాడాడు. ఈ దంపతులిద్దరూ తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 10:06 AM IST
Karthikeya Tirumala Visit: తిరుమల శ్రీవారి సేవలో హీరో కార్తికేయ దంపతులు.. ఫొటోలు వైరల్

Karthikeya Tirumala Visit: ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన హీరో కార్తికేయ- లోహిత దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో వారు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు కొత్త దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్తికేయ-లోహిత వెంట వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ దంపతుల తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుంటూ దాంపత్య బంధంలోకి అడుగుపెట్టారు కార్తికేయ-లోహిత దంపతులు. హైదరాబాద్‌లోని ఓ కల్యాణమండపం వేదికగా తన ప్రియురాలు లోహిత మెడలో మూడు ముళ్లు వేశాడు హీరో కార్తికేయ. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా పెళ్లికి హాజరై కార్తికేయ- లోహిత దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

’ఆర్‌ఎక్స్‌ 100′ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ ఆ తర్వాత ‘హిప్పీ’, ‘గుణ 369′, ’90 ఎంఎల్‌’ సినిమాల్లో హీరోగా నటించాడు. నాని హీరోగా వచ్చిన ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమాలో విలన్‌గా ఆకట్టుకున్నాడు. ఆతర్వాత ‘చావు కబురు చల్లగా’ అంటూ అలరించిన ఈ హీరో ఇటీవల ‘రాజా విక్రమార్క’తో మన ముందుకు వచ్చాడు. ప్రస్తుతం అతను అజిత్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘వాలిమై’లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: Akhanda pre-release: బాలయ్య ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​- అఖండ ప్రీ రిలీజ్​కు స్పెషల్​ గెస్ట్ ఎవరంటే..

Also Read: Bheemla Nayak Teaser: పవన్ కల్యాణ్ ‘భీమ్లానాయక్’ టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News