Gruhalakshmi Serial Samrat : మిడ్ నైట్ సినిమా చూపించేశాడుగా.. బెడ్రూంలో ఇంద్రనీల్ గోల.. తలపట్టేసుకున్న భార్య

indraneil meghana సీరియల్ నటులు ఇంద్రనీల్, మేఘన ప్రేమ, పెళ్లి స్టోరీలు అందరికీ తెలిసిందే. ఒకే సీరియల్‌లో అల్లుడు, అత్తలా నటించారు. చివరకు భార్యాభర్తలుగా నిజ జీవితంలో మారిపోయారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2022, 10:27 AM IST
  • సోషల్ మీడియాలో ఇంద్రనీల్, మేఘన సందడి
  • అర్దరాత్రి పాటలు పాడుతూ జోడి హల్చల్
  • నిద్ర రాకపోతే అదే పని అంటోన్న ఇంద్రనీల్
Gruhalakshmi Serial Samrat : మిడ్ నైట్ సినిమా చూపించేశాడుగా.. బెడ్రూంలో ఇంద్రనీల్ గోల.. తలపట్టేసుకున్న భార్య

indraneil meghana : బుల్లితెర నటీనటులు ఇంద్రనీల్, మేఘన గురించి అందరికీ తెలిసిందే. మొగలి రేకులు, చక్రవాకం సీరియల్లతో ఇంద్రనీల్‌కు స్టార్డం వచ్చింది. ఇక అందులోనే నటించిన మేఘనతో ఇంద్రనీల్‌కు ప్రేమ ఏర్పడింది. ఆ సీరియళ్లలో ఈ ఇద్దరూ అతా, అల్లుడి పాత్రలు వేశారు. కానీ రియల్‌ లైఫ్‌కు వచ్చే సరికి మాత్రం భార్యాభర్తలుగా మారిపోయారు. ఈ జోడి మీద ఒకప్పుడు విపరీతమైన ట్రోలింగ్ వచ్చేది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ కూడా నానా రకాలుగా మాట్లాడేవారట. ఈ విషయాలన్నీ చెబుతూ మేఘన స్టేజ్ మీదే కన్నీరు పెట్టేసుకుంది.

ఇస్మార్ట్ జోడిలోనూ ఈ జంట పాల్గొంది. ప్రస్తుతం ఇంద్రనీల్, మేఘనలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటారు. ఈ ఇద్దరూ నెట్టింట్లో తమ తమ పోస్టులతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే ఆ మధ్య ఓ సారి మేఘన తన అభిమానులకు సారీ కూడా చెప్పింది. తాను చేసిన ప్రమోషన్స్‌ మూలానా.. కొన్ని ప్రొడక్ట్‌లను కొనడం, అవి బాగా లేవని అభిమానులు ఫిర్యాదు చేయడంతో.. మేఘన తన ఫాలోవర్లకు సారీ చెప్పింది. ఇకపై ఇలాంటి యాడ్స్ చేయను అని చెప్పింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Indraaneil Indraaneil (@indra_actor_official)

ఇప్పుడు ఇంద్రనీల్ అయితే గృహలక్ష్మీ సీరియల్‌లో సామ్రాట్ పాత్రలో దుమ్ములేపుతున్నాడు. సామ్రాట్, తులసి చుట్టే ఈ సీరియల్ తిరుగుతోంది. తాజాగా ఇంద్రనీల్, మేఘనలు ఓ వీడియోను షేర్ చేశారు. అర్దరాత్రి దాటకు రెండున్నర గంటల సమయంలో ఇంద్రనీల్‌కు నిద్ర రాలేదట. దీంతో పాటలు పాడుతూ నానా సందడి చేశాడు. ఈ టైంలో ఈ గోల ఏంటి? అన్నట్టుగా మేఘన తల పట్టేసుకుంది. హిందీ లిరిక్స్ పెట్టు.. పాట పాడుతాను అని ఇంద్రనీల్ మారాం చేశాడు.

దీంతో హిందీ లిరిక్స్‌ను గూగుల్లో వెతికి పెట్టడంతో.. ఇంద్రనీల్ పాడేశాడు. ఇంద్రనీల్‌తో పాటుగా మేఘన కూడా గొంతు కలిపింది. ఈ వీడియోను చూసిన జనాలు ఈ జోడిని పొగుడుతున్నారు. చక్కటి జంట.. అర్థం చేసుకునే వాళ్లు దొరికితే లైఫ్ ఇలానే హ్యాపీగా ఉంటుంది అంటూ ఇంద్రనీల్, మేఘనల మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read : Sreemukhi Red Saree Photoshoot : ఎరుపుచీరలో వలపుల వల.. బీచ్‌లో శ్రీముఖి సెగలు

Also Read : Harish Shankar : పవన్ దగ్గర ఆ విషయంలో ఫెయిలైన హరీష్ శంకర్.. ఫాన్స్ కు కొత్త టెన్షన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News