Gopichand movie: గోపీచంద్ డైలాగ్స్‌కు సీటీమార్...టీజర్ విడుదల

Gopichand movie: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 బ్రేక్ ఫలితం. 2021లో వరుసగా సినిమాలు, టీజర్ల విడుదల హల్‌చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్‌తో తెరకెక్కిన సీటీమార్ టీజర్ విడుదలైంది. గోపీచంద్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.  

Last Updated : Feb 22, 2021, 12:05 PM IST
Gopichand movie: గోపీచంద్ డైలాగ్స్‌కు సీటీమార్...టీజర్ విడుదల

Gopichand movie: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 బ్రేక్ ఫలితం. 2021లో వరుసగా సినిమాలు, టీజర్ల విడుదల హల్‌చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్‌తో తెరకెక్కిన సీటీమార్ టీజర్ విడుదలైంది. గోపీచంద్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు గోపీచంద్( Gopichand ). విలన్‌గా ఎంట్రీ ఇచ్చినా హీరోగా నిలదొక్కుకున్నాడు. గోపీచంద్‌తో సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ ఖాయమనేది నిర్మాతల అభిప్రాయం. యాక్షన్ హీరోగా పేరు సంపాదించుకున్న గోపీచంద్ తాజా చిత్రం సీటీమార్. తమన్నా, గోపీచంద్‌లు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సీటీమార్ సినిమా టీజర్ ( Seetimaarr movie teaser released ) ఫిబ్రవరి 22న విడుదలై సంచలనం కల్గిస్తోంది. టీజర్‌లో గోపీచంద్ డైలాగ్స్( Gopichand dialogues ) చాలా ఆకట్టుకుంటున్నాయి. 

మైదానంలో ఆడితో ఆట..బయట ఆడితే వేట అనే డైలాగ్స్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా అప్పుడే మీమ్స్‌గా ట్రోల్ అవుతున్నాయి. కబడ్డ ఆట నేపధ్యంలో సినిమా కధ ఉంటుంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన సీటీమార్ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీచంద్ ఆంధ్రా టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తుండగా తమన్నా( Tamannaah Bhatia) తెలంగాణ మహిళా టీమ్ కోచ్‌గా నటిస్తోంది. సినిమాకు మణిశర్న సంగీతం అందించగా..సూర్యవంశీ, భూమికా చావ్లా, రెహ్మాన్, రావు రమేశ్, తరుణ్ అరోరా, పోసాని కృష్ణమురళి, రోహిత్ పాథక్, అంకూర్ సింగ్  తదితరులు కీలకపాత్రల్లో కన్పించనున్నారు. 

Also read: KGF 2: కేజీఎఫ్ 2 తెలుగు హక్కులు ఎంతకు విక్రయించారో తెలుసా..కొనుగోలు చేసింది అతడే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News