Rama Banam vs Ugram Collections: డిజాస్టర్ టాక్ తోనూ 'ఉగ్రం'ని తొక్కి దూసుకుపోతున్న రామబాణం

Rama Banam Collections Vs Ugram Collections: గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం సినిమా, అల్లరి నరేష్ హీరోగా నటించిన ఉగ్రం సినిమా ప్రేక్షకుల ముందు వచ్చాయి. ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలిద్దాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 6, 2023, 01:30 PM IST
Rama Banam vs Ugram Collections: డిజాస్టర్ టాక్ తోనూ 'ఉగ్రం'ని తొక్కి దూసుకుపోతున్న రామబాణం

Rama Banam 1st Day Collections Vs Ugram 1st Day Collections: మే 5వ తేదీ శుక్రవారం నాడు తెలుగులో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందు వచ్చాయి కానీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది మాత్రం రెండే సినిమాలు. అందులో ఒకటి గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం సినిమా కాగా మరొకటి అల్లరి నరేష్ హీరోగా నటించిన ఉగ్రం సినిమా. ఈ రెండు సినిమాల్లో ఉగ్రం సినిమాకి మంచి టాక్ వచ్చింది. గోపీచంద్ సినిమా అయితే రొటీన్ సినిమా కావడంతో ప్రేక్షకులు ఎక్కువగా దాని మీద ఆసక్తి చూపించలేదు.

అయితే మొదటి రోజు కలెక్షన్స్ కనుక మనం పరిశీలిస్తే గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం సినిమాకి అల్లరి నరేష్ హీరోగా నటించిన ఉగ్రం సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎంత రాబట్టాయి అనే విషయాలు పరిశీలిద్దాం. ముందుగా అల్లరి నరేష్ హీరోగా నటించిన ఉగ్రం సినిమా విషయానికొస్తే ఈ సినిమా నైజాం ప్రాంతంలో 23 లక్షలు వసూలు చేయగా సీడెడ్ ప్రాంతంలో 10 లక్షలు, ఉత్తరాంధ్రలో ఏడు లక్షలు, ఈస్ట్ గోదావరి ప్రాంతంలో ఐదు లక్షలు, వెస్ట్ గోదావరి మూడు లక్షలు, గుంటూరు 5 లక్షలు, కృష్ణాజిల్లా ఐదు లక్షలు, నెల్లూరు 3 లక్షలు మొత్తం కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 61 లక్షల షేర్, కోటి 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది.

ఇక కర్ణాటక సహా మిగతా భారతదేశం అలాగే ఓవర్సీస్ మొత్తం కలిపి 12 లక్షలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 73  లక్షల షేర్ వసూలు చేయగా కోటి 45 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 5 కోట్ల 80 లక్షలకు జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా ఆరు కోట్ల యాభై లక్షలు నిర్ణయించారు. ఇక సినిమా ఇంకా ఐదు కోట్ల 77 లక్షల వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అయినట్లుగా భావించాల్సి ఉంటుంది. 

Also Read: Naga chaitanya: సమంత చాలా మంచిది.. 'ఆమె'ను అగౌరవపరుస్తున్నారు.. నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు

ఇక మరో పక్క గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం సినిమా మొదటిరోజు ఏరియా వారిగా వసూళ్ల వివరాలు పరిశీలిస్తే నైజాం ప్రాంతంలో 46 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా సీడెడ్ ప్రాంతంలో 21 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 14 లక్షలు, ఈస్ట్ గోదావరి ప్రాంతంలో 9 లక్షలు, వెస్ట్ గోదావరి ఆరు లక్షలు, గుంటూరు ఎనిమిది లక్షలు, కృష్ణాజిల్లా ఎనిమిది లక్షలు, నెల్లూరు జిల్లా ఐదు లక్షలు అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కోటి 15 లక్షల షేర్, రెండు కోట్ల 20 లక్షల గ్రాస్ వసూలు చేసింది.

ఇక కర్ణాటక సహా మిగతా భారతదేశంతో పాటు ఓవర్సీస్ లో 10 లక్షలు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కోటి 27 లక్షల షేర్, రెండు కోట్ల 45 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా మొత్తం బిజినెస్ 14 1/2 కోట్లకు జరగడంతో 15 కోట్ల 20 లక్షలు బ్రేక్ ఈవెన్ టార్గెట్గా నిర్ణయించారు. అంటే ఇంకా సినిమా 13 కోట్ల 97 లక్షలు వసూలు చేస్తే అప్పుడు హిట్ అయినట్లుగా లెక్కిస్తారు.

అయితే టాక్ తో సంబంధం లేకుండా అల్లరి నరేష్ ఉగ్రం సినిమా కంటే రామబాణం సినిమా ఎక్కువ వసూలు చేయడం గమనార్హం. అల్లరి నరేష్ మార్కెట్ తక్కువే అయినా ప్రీ రిలీజ్ బిజినెస్ కి కూడా తక్కువనే అయింది. కాబట్టి అల్లరి నరేష్ సినిమా కొనుగోలు చేసిన వారు సేఫ్ జోన్ లో పడొచ్చు అని అంచనాలు వెలబడుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. 

Also Read: Samantha Photos: బర్త్ డే సెలబ్రేషన్స్ లో సమంత నోటి వెంట 'ఎఫ్ వర్డ్'..నైట్ డ్రెస్సులో ఎలా ఉందో చూసారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News