Viral Video: ఈ ఆంటీ చాలా స్మార్ట్ గురూ.. పక్కనే ఉండి చాకచక్యంగా ఫోన్‌ను కొట్టేసింది!

Aunty Cleverly stealing a mobile phone from woman bag. మధ్య వయస్కురాలైన ఓ మహిళ దుకాణంలో మరొక మహిళ బ్యాగ్ నుంచి మొబైల్ ఫోన్‌ను చాలా చాకచక్యంగా దొంగిలించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 15, 2022, 05:56 PM IST
  • ఈ ఆంటీ చాలా స్మార్ట్ గురూ
  • పక్కనే ఉండి చాకచక్యంగా ఫోన్‌ను కొట్టేసింది
  • మహిళ ట్రిక్‌కి నెటిజన్లు ఫిదా
Viral Video: ఈ ఆంటీ చాలా స్మార్ట్ గురూ.. పక్కనే ఉండి చాకచక్యంగా ఫోన్‌ను కొట్టేసింది!

Aunty Cleverly stealing a mobile phone from woman bag at a store: రోజురోజకి దొంగల అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఇల్లు, ఆఫీస్, మాల్స్, దుకాణాలు అనే తేడాలేకుండా దోచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో రోడ్డుపై కూడా దోచుకుంటున్నారు. అనుమానాస్పదంగా కనిపించకుండా పక్కనే ఉంటూ పర్స్, మొబైల్, మనీని దొంగలిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. మధ్య వయస్కురాలైన ఓ మహిళ దుకాణంలో మరొక మహిళ బ్యాగ్ నుంచి మొబైల్ ఫోన్‌ను చాలా చాకచక్యంగా దొంగిలించింది. 

ఓ మహిళ దుకాణం వద్దకు వచ్చి ఓ బాటిల్ కొనుగోలు చేస్తుంది. పక్కనే ఆమె భర్త కూడా ఉంటాడు. దుకాణ యజమాని బిల్ కొడుతుండగా.. మధ్య వయస్కురాలైన ఓ ఆంటీ అక్కడికి వస్తుంది. ఆ ఆంటీ కౌంటర్ వద్దకు వచ్చి దుకాణదారుని ఓ ఐటమ్ ఇవ్వమని అడుగుతుంది. ఆమెకు దుకాణంలో షాపింగ్ చేసి బిల్లులు చెల్లిస్తున్న మహిళ కనిపిస్తుంది. దుకాణం చాలా రద్దీగా ఉండడంతో కౌంటర్ వద్దకు వచ్చిన ఆంటీ.. బిల్ కోసం వేచిచూస్తున్న మహిళ మొబైల్ కొట్టేయాలని నిర్ణయించుకుంది. 

మొబైల్ కొట్టేయాలనుకున్న ఆంటీ.. తన పక్కన నిలబడి ఉన్న మహిళను కావాలనే ఢీ కొడుతుంది. అదే సమయంలో ఆ మహిళ బ్యాగ్ జిప్ తీసేస్తుంది. ఆంటీ దుకాణదారుని ఓ ఐటమ్ అవ్వమని అడుగుతూనే.. మహిళ బ్యాగులోపలికి చేతి పెట్టి మొబైల్ తీస్తుంది. ఆపై తన  బ్యాగులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫోన్ దొంగిలించబడిన మహిళకు ఏమి జరిగిందో కూడా తెలియదు. ఆ తర్వాత తన ఫోన్ పోయిందని తెలుసుకున్న మహిళ లబోదిబోమంటుంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

ఈ వీడియో గిడ్డే అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఆంటీ దొంగతనంకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పక్కనే ఉండి చాకచక్యంగా ఫోన్‌ను కొట్టేసిన మహిళ ట్రిక్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశారు. 'ఈ ఆంటీ చాలా స్మార్ట్ గురూ', 'పక్కనే ఉండి భలే కొట్టేసింది పో' అంటూ ట్వీట్ల వర్షం కురుస్తోంది.

Also Read: Warne-Symonds: ఆ యువ క్రికెటర్‌ను వార్న్‌, సైమండ్స్ అనరాని మాటలన్నారు.. నెలల వ్యవధిలో మృతి చెందారు!

Also Read: Thomas Cup 2022: బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. 73 ఏళ్ల త‌ర్వాత..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News