Bimbisara 2: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బింబిసార 2 షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..!

Bimbisara Update: బింబిసార అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు దర్శకుడు వశిష్ట. తాజాగా ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2022, 11:40 AM IST
Bimbisara 2:  ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బింబిసార 2 షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..!

Bimbisara 2 Movie Update: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రీసెంట్ గా వచ్చిన సినిమా బింబిసార (Bimbisara). వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓటీటీలో కూడా ఈ చిత్రానికి ఫ్యాన్స్ కు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి సీక్వెల్ ఉంటుందని చిత్రయూనిట్ గతంలోనే హింట్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించి డైరక్టర్ వశిష్ఠ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషాయాలను పంచుకున్నాడు.  ఈ సందర్భంగా బింబిసార సీక్వెల్ ను ఆయన ధృవీకరించారు. 

''బింబిసారను ప్రేక్షకులు ఎంతోగానే ఆదరించి.. పెద్ద విజయాన్ని అందించారు. ప్రస్తుతం వాళ్లు సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ల అంచనాలకు తగ్గట్టుగానే సీక్వెల్ ను రూపొందించాలనుకుంటున్నాం. ఖచ్చితంగా దీని ఒత్తిడి నాపై ఉంటుంది. కల్యాణ్ రామ్ తన దగ్గర ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బింబిసార 2 షూటింగ్ ప్రారంభమవుతుంది'' అని వశిష్ట చెప్పారు. 

బింబిసార సినిమా ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కురిపించింది. బింబిసారుడుగా, దేవదత్తుడుగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన కల్యాణ్ రామ్ తన నటనతో సత్తా చాటాడు. ఈ చిత్రానికి కీరవాణితోపాటు చిరంతన్ భట్ సంగీతం అందించారు. తక్కువ బడ్జెట్‌లో భారీ విజువల్స్‌ తో ను తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకుల్ని మెస్మరైజ చేసింది. ప్రస్తుతం కల్యాణ్ రామ్ 'డెవిల్' సినిమాలో నటిస్తున్నారు. 

Also read: Swara Bhaskar Trolls : నీకు ఇంతకంటే పెద్దది కావాలా?.. స్వర భాస్కర్ కౌంటర్ వైరల్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News