Bigg Boss 07 Telugu: బిగ్ బాస్ నుంచి డాక్టర్ బాబు ఎలిమినేట్.. శివాజీతో గొడవే కారణమా!

Bigg Boss 07 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 నుంచి డాక్టర్ బాబు ఎలిమినేట్ అయ్యాడు. శివాజీతో గొడవ పెట్టుకోవడం, గత వారం సరిగ్గా ఆడకపోవడం వల్లే గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2023, 11:25 AM IST
Bigg Boss 07 Telugu: బిగ్ బాస్ నుంచి డాక్టర్ బాబు ఎలిమినేట్.. శివాజీతో గొడవే కారణమా!

Bigg Boss 07 Telugu Elimination:  బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 తుదిదశకు చేరుకుంది. పదమూడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే ఉత్కంఠకు తెరపడింది. ఎవరు ఊహించని విధంగా  డాక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ కృష్ణ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఎప్పటిలాగే శోభాను బిగ్ బాస్ టీమ్ కాపాడింది. గత వారం నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్‌, గౌతమ్‌ కృష్ణ, శివాజీ, అర్జున్‌ అంబటి, శోభా శెట్టి, ప్రియాంక జైన్‌, ప్రిన్స్‌ యావర్‌ ఉన్నారు. ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా చివరకు శోభా, గౌతమ్‌ మిగిలారు. వీరిద్దరిలో గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. 

ఈసారి బిగ్‌బాస్‌ సీజన్‌-7 ప్రైజమనీను ముందుగానే రివీల్ చేశారు మేకర్స్. ఈసారి ఫైనల్‌ విజేత రూ.50 లక్షలు, కారు, రూ.15 లక్షల విలువైన ఆభరణాలు గెలుపొందుతారని నాగార్జున ప్రకటించారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ స్టేజ్ పై నా సామిరంగ’ హీరోయిన్‌ అషికా రంగనాథన్‌, నేచురల్ స్టార్ నాని సందడి చేశారు. . ‘హాయ్‌ నాన్న మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో నాని కంటెస్టెంట్లతో మాట్లాడారు.  

కారణం ఇదే!

బిగ్ బాస్ తొలి వారం నుంచి పెద్దగా ప్రభావం చూపించని గౌతమ్..సీక్రెట్ రూమ్ కి వెళ్లి వచ్చిన దగ్గర నుంచి తన గేమ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాకుండా శివాజీతో తరచూ నామినేట్ చేస్తూ.. గొడవ పెట్టుకుని హైలైట్ అయ్యాడు. డాక్టర్ బాబు వెళ్లిపోయే ముందు కూడా వీరద్దరి మధ్య మళ్లీ అదే వాగ్వాదం జరిగింది. శివాజీతో గొడవ పెట్టుకోవడం ప్లస్ అనుకున్న గౌతమ్.. చివరకు అదే కొంప ముంచిందనే చెప్పాలి. ఇకపోతే వారానికి లక్షన్నర చొప్పున 13 వారాలకు గౌతమ్ రూ.19.5 లక్షలు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. 

Also read: Nani: చిరంజీవి మాస్ లో పెద్ద స్టార్.. కానీ అలాంటి సినిమాలు చేయలేదు.. నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News