Figher Ott Streming: ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసిన హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ..

Figher Ott Streming : బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఫైటర్'. సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా గణతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 21, 2024, 12:07 PM IST
Figher Ott Streming: ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసిన హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ..

Figher Ott Streming : గత కొన్నేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో దేశ భక్తి నేపథ్యంలో పలు చిత్రాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన మరో చిత్రం 'ఫైటర్'. సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో  హృతిక్ రోషన్, దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ ఒకప్పటి అగ్రహీరో అనిల్ కపూర్ మరో లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. దేశ భక్తి ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ మూవీ గణతంత్య్ర దినోత్సవ  కానుకగా విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. అయితే టాక్‌కు తగ్గట్టు ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టలేకపోయింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో గురువారం (21-3-2024) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఫైటర్ మూవీ విషయానికొస్తే.. ఈ హృతిక్ రోషణ్, సిద్ధార్ధ్ ఆనంద్ కలయికలో గతంలో వచ్చిన 'బ్యాంగ్ బ్యంగ్', 'వార్' చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలవడంతో 'ఫైటర్' మూవీపై భారీ అంచనాలతో విడుదలైంది. ఈ మూవీలో హృతిక్ రోషన్ సరసన తొలిసారి దీపికా పదుకొణే నటించింది. అనిల్ కపూర్ మరో ముఖ్యపాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని వయాకామ్ 18 నిర్మించింది.

గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ నెల 25న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజైంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ భారత్ ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్రలో మెప్పించారు. అంతేకాదు ఫైటర్ మూవీ  మన దేశంలో తొలి ఏరియల్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కింది. గాల్లో ఫైట్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించాయి. ఈ మూవీని పుల్వామాలో మన దేశ సైనికులపై దాడి చేసిన పాకిస్థాన్ ముష్కర మూకలను పీచమణచడానికి మన సైనికులు పాక్ భూభాగంలోకి వెళ్లి చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా తెరకెక్కించారు. పాకిస్థాన్ పై చేసిన రెండో సర్జికల్ స్ట్రైక్. మొదటిసారి పఠాన్ కోట్ దాడి తర్వాత.. రెండోసారి మన సైనికలు వాళ్ల భూభాగంలోకి వెళ్లి చేసిన మెరుపు దాడి. ఈ రెండింటి కంటే మ్యాన్‌మార్‌లో చేసిన సర్జికల్ స్ట్రైక్ కూడా దేశ చరిత్రలో నిలిచిపోయింది.

'ఫైటర్' మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ.180 కోట్ల నెట్ వసూళ్లు.. వరల్డ్ వైడ్‌గా రూ.350 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. విదేశీ ప్రేక్షకులు  ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. అక్కడ ఈ సినిమా $ 7మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఓవరాల్‌గా భారతీయ ప్రేక్షకులను అంతగా చూడని ఈ సినిమా ఓవర్సీస్ ఆడియన్స్‌ను మాత్రం  తెగ ఆదరించారు.ఫైటర్ మూవీని వయాకామ్ 18 సంస్థ మార్‌ఫ్లిక్స్ సంస్థ‌ సంయుక్తంగా తెరకెక్కించింది. సిద్ధార్ధ్ ఆనంద్ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మన దేశంలో తొలి ఏరియల్ ఫ్రాంఛైజీ మూవీగా వచ్చింది. ఈ చిత్రాన్ని అత్యాధునిక టెక్నాలజీతో ఎంతో ఉన్నతంగా తెరకెక్కించారు. ఈ మూవీలో గ్రాఫిక్స్ కీ రోల్ ప్లే చేసాయి.

ఈ చిత్రాన్ని కేవలం హిందీలో మాత్రమే విడుదల చేసారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ చిత్రాన్ని మన దేశంతో పాటు విదేశాల్లో విడుదల చేసారు. దేశ భక్తి నేపథ్యంలో దాయాది దేశం పాకిస్థాన్ పై చేసిన సర్జికల్ దాడుల నేపథ్యంలో తెరకెక్కడంతో ఈ మూవీని కొన్ని మిడిల్ ఈస్ట్  ఇస్లామిక్ దేశాలైన పాకిస్థాన్‌లో పాటు ఇరాన్, సిరియా, సౌదీ అరేబియా దేశాలు ఈ మూవీ రిలీజ్ పై అప్పట్లో బ్యాన్ విధించాయి. ఒక్క యునైడెట్ అరబ్ ఎమిరేట్స్‌లో మాత్రమే ఈ మూవీ రిలీజ్ అయింది. ఇక హృతిక్ రోషన్ సినిమాల విషయానికొస్తే.. ఈయన ఎన్టీఆర్‌తో కలిసి 'వార్ 2' మూవీ చేస్తున్నారు. యశ్ రాష్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ బ్యానర్ పై వస్తోన్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇప్పటికే హృతిక్ రోషన్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. మరో వైపు హృతిక్ తన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో ‘క్రిష్ 4’ మూవీ చేయనున్నారు. 

ఇదీ చదవండి: పరగడుపున తులసి నీరు తాగితే ఈ సమస్యలు అన్ని పరార్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News