Kalki2898AD: కల్కిలో దీపిక పడుకొనే పరిస్థితి కూడా చివరికి అంతేనా! కంగారులో ఫ్యాన్స్..

Kalki Update: భారీ అంచనాల మధ్య.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా ఈనెల 27వ తేదీన.. థియేటర్లలో విడుదలకి సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాలో దీపికా పడుకొనే పాత్ర గురించి.. చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. సినిమాలో ఈమె పాత్ర కీలకం అని హైప్ ఇస్తున్నారు.. కానీ ఆ పాత్ర ఆమెకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అభిమానులలో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 10, 2024, 12:33 PM IST
Kalki2898AD: కల్కిలో దీపిక పడుకొనే పరిస్థితి కూడా చివరికి అంతేనా! కంగారులో ఫ్యాన్స్..

Deepika Padukone Kalki: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. నటించిన కల్కి2898AD సినిమా.. జూన్ 27న భారీ అంచనాల మధ్య విడుదలకి సిద్ధం అవుతుంది. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పడుకొనే ఈ సినిమాలో.. హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెతోపాటు లోకనాయకుడు కమల్ హాసన్, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ నటులు.. కూడా ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. 

ఇప్పటికే చిత్ర బృందం భారీ స్థాయిలో.. ప్రమోషన్లను మొదలు పెట్టేసింది. సినిమాలో కనిపించబోయే రోబోటిక్ కార్ బుజ్జిని కూడా.. పరిచయం చేస్తూ సినిమాపై భారీగా హైప్ ని పెంచింది. కీర్తి సురేష్ ఆ కార్ కి డబ్బింగ్ చెప్పడం వల్ల.. సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా ప్రమోషన్స్ మొదలై.. చాలా కాలం అయింది కానీ.. సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పడుకొనే మాత్రం.. చాలా తక్కువగా మాత్రమే కనిపించింది. 

టీజర్ లో కేవలం ఒకటి రెండు చోట్ల.. అలా కనిపించి ఇలా వెళ్లిపోయిన దీపిక చాలావరకు ప్రమోషనల్ కంటెంట్ లో కనిపించలేదు. అయితే ఎట్టకేలకు ఈ మధ్యనే.. ఆమె పాత్రకి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. హోప్ బిగిన్స్ విత్ హర్ (ఆమెతోనే ఆశలు మొదలవుతాయి) అంటూ.. సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది అని ఇండైరెక్టుగా చిత్ర బృందం చెబుతోంది. 

అయితే నిజంగానే ఆమె పాత్రకి అంత సీన్ ఉంటుందా.. అని అభిమానులలో సైతం ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. నిజానికి బ్లాక్ బస్టర్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా.. అలియా భట్ పాత్ర కనిపించి ఎన్టీఆర్ కి రామ్ చరణ్ గురించి చెప్పడం వల్లే కథ కీలక మలుపు తిరుగుతుంది. కానీ ఆ సన్నివేశం తప్ప ఆలియాకి పెద్ద నటించే…స్కోప్ కూడా దక్కలేదు. 

కల్కి సినిమాలో కూడా దీపికా పడుకొనే పాత్ర వల్లే కథ కీలక మలుపు తిరిగే అవకాశం.. ఉందని చెప్పుకోవచ్చు. కానీ కేవలం కథ మలుపు తిప్పడం తప్ప.. ఆమె పాత్రకి స్కోప్ ఉంటుందా.. లేక ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియాభట్ లాగానే ఈమె పరిస్థితి కూడా అయిపోతుందా.. అనేది ప్రశ్నర్ధకంగా మారింది. 

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన ఆలియా.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయితే అయింది కానీ.. సినిమా వల్ల ఆమెకి పెద్దగా ఉపయోగం కలగలేదు. ఇటు దీపికా పడుకొనే కూడా కల్కి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. మరి కల్కి సినిమా.. ఆమెకు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియాలంటే.. సినిమా విడుదల అయ్యేదాకా ఎదురు చూడాల్సిందే.

Read more; Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News