Family Star Pre Release Pressmeet: 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో అన్ని షేడ్స్ ఉన్నాయి.. ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో దిల్ రాజు కామెంట్స్..

Family Star Pre Release Pressmeet:  విజయ్ దేవరకొండ కథానాయికుడిగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. మరో నాలుగు రోజుల్లో థియేటర్స్‌లో ఈ సినిమా పలకరించనుంది.  ఈ సందర్భంగా ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు,  హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. అంతేకాదు సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 1, 2024, 04:33 PM IST
Family Star Pre Release Pressmeet: 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో అన్ని షేడ్స్ ఉన్నాయి.. ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో దిల్ రాజు కామెంట్స్..

Family Star Pre Release Pressmeet:హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - మనకు జీవితంలో ఏ కష్టం వచ్చినా అండగా నిలబడి నేనున్నా అని ధైర్యం చెప్పే వ్యక్తి మన కుటుంబాల్లో ఒకరు   ఉంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్. మా కుటుంబంలో మా నాన్న ఫ్యామిలీ స్టార్. డైరెక్టర్ పరశురామ్ ఈ కథ చెప్పినప్పుడు ఆయన లైఫ్ లోని అనుభవాలను ఊహించుకుంటూ ఈ స్టోరీ నేరేట్ చేసాడు కథ వింటున్నప్పుడు మాత్రం నాకు మా నాన్న గుర్తొచ్చాడు. ఫ్యామిలీ కోసం ఆయన పడిన తపన గుర్తుకువచ్చింది. అందుకే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు గోవర్థన్ అనే పేరు పెట్టమని చెప్పాను. ఎందుకంటే ఆ పేరు పెట్టుకున్న తర్వాత ఎమోషన్స్ పలికించడం సులువు అయింది. ఆయన ఎలా ఫ్యామిలీ కోసం పనిచేసేవారో గుర్తుకు వస్తుంటుంది. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతోంది. ఏప్రిల్ 8న నాన్న బర్త్ డే. ఈ సినిమా చూసి  ఆయన గర్వపడతారని ఆశిస్తున్నాను.  ఏప్రిల్ 5న రాజు గారు దిల్ రాజు అయ్యారు. ఈ ఏప్రిల్ 5 డేట్ కూడా ఆయన కెరీర్ లో స్పెషల్ కావాలి. నెక్ట్ ఏ జానర్ సినిమా చేయాలి అనే ఆలోచనలో ఉండను. నన్ను అప్రోచ్ అయ్యే డైరెక్టర్స్ చెప్పే కథ నచ్చితే వెంటనే ఓకే చెబుతాను.

ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం 9 నెలల వర్క్ చేశాం. అంతకు ఏడాది ముందే డైరెక్టర్ సింగిల్ లైన్ చెప్పాడు. వినగానే నాకు బాగా నచ్చింది. అయితే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయండని అడిగాను. రాజు గారు లాక్ డౌన్ లో నాకు డబ్బులు ఇబ్బందిగా ఉన్నప్పుడు పంపించారు. ఆయనకు సినిమా చేయాలని అనుకున్నా. పరశురామ్ చెప్పిన లైన్ బాగుందన్నారు. అయితే ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యాక చేద్దామని రాజు గారికి చెప్పాను. ఆయన కొన్ని రోజుల తర్వాత ఫుల్ స్క్రిప్ట్ తో పరశురామ్ తో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా సితార ఎంటర్టైన్మెంట్ వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం వాళ్ల డేట్స్ ఈ సినిమా కోసం కేటాయించాను.ఈ టైమ్ లో నేను డైరెక్టర్ గౌతమ్ కు, సితార సంస్థకు థ్యాంక్స్ చెప్పాలి. మా కాంబోలో సినిమా బిగిన్ అయ్యింది. అయితే అది బిగ్ స్కేల్ సినిమా. ఫ్యామిలీ స్టార్ 80 డేస్ లో షూటింగ్ ఫినిష్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు గౌతమ్, సితార వాళ్లకు చెబితే సరేనన్నారు. 80 డేస్ అనుకున్నది 110, 120 డేస్ అయ్యింది. సంక్రాంతికి రాలేకపోయాం. అయినా మంచే జరిగింది. ఏప్రిల్ 5 పర్పెక్ట్ డేట్ గా భావిస్తున్నాం.  నేను లైఫ్ పార్టనర్ చేసుకునే అమ్మాయి మా ఇంట్లో వాళ్లకు నచ్చాలి. అలా నచ్చేలా నేను చూసుకోవాలి.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - ఫ్యామిలీ స్టార్ సినిమా విషయంలో ప్రతి అంశం పాజిటివ్ గా కనిపిస్తోంది. పాటలు, ట్రైలర్ మీరు చూశారు మీ అందరికీ నచ్చింది. అందుకే మీలోనూ ఆ హ్యాపీనెస్ కనిపిస్తోంది. పరశురామ్ ఈ కథ చెప్పగానే అందులోని పాయింట్ నన్ను ఎగ్జైట్ చేసింది. స్టోరీని డెవలప్ చేశాక మేమంతా ఇంప్రెస్ అయ్యాం. విజయ్, పరశురామ్ కలిసి గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ చేశారు. ఈ సినిమా కూడా వాళ్ల కాంబినేషన్ లో సక్సెస్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. ఫ్యామిలీ స్టార్ కు విజయ్ క్యారెక్టరైజేషన్ వెన్నెముక లాంటిది. విజయ్ నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, ఫైట్ చేస్తాడు, ఫ్యామిలీ కోసం ఆలోచిస్తాడు. అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెను ద్వేషిస్తాడు. రొమాన్స్ చేస్తాడు..ఇలా అన్ని షేడ్స్ హీరో క్యారెక్టర్ లో ఉన్నాయి. విజయ్ ఈ సినిమాలో 360 డిగ్రీస్ క్యారెక్టర్ చేశాడని చెప్పవచ్చు. ఇది కేవలం ఫ్యామిలీ స్టోరీ మాత్రమే కాదు లవ్ స్టోరీ కూడా ఉంటుంది.రెండు మూడు తరాలు కలిసి ఉంటాయి. ఆ ఫ్యామిలీ వ్యాల్యూస్ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఏప్రిల్ 5 నాకు ఎంతో స్పెషల్. ఆ రోజుతో దిల్ సినిమా రిలీజ్ తో నేను రాజు నుంచి దిల్ రాజు అయ్యాను. అప్పటి నుంచి మొన్నటి బలగం సినిమా వరకు మీరూ, ప్రేక్షకులూ ఎంతో సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ ఇకపైనా కొనసాగాలని కోరుకుంటున్నాను.

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ - సీతారామం సినిమా చేస్తున్నప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నాకు ఇంత గొప్ప కెరీర్ ఉంటుందని అస్సలు ఊహించలేదు. సీతారామం తర్వాత హాయ్ నాన్న వంటి మంచి స్క్రిప్ట్ దొరికింది. ఈ రెండు సినిమాల తర్వాత నేను చేసే సినిమాల స్పెషల్ గా ఉండాలని అనుకున్నాను. అలాంటి స్పెషల్ స్కిప్ట్ ను పరశురామ్ గారు నెరేట్ చేశారు. గోవర్థన్, ఇందూ, బామ్మ ఇతర క్యారెక్టర్స్ మధ్య బ్యూటిఫుల్ గా స్టోరీ ఉంటుంది. మన జీవితం అర చేతిలాంటిది. మన వేళ్లలాగే జీవితంలో కూడా ఎత్తుపల్లాలు ఉంటాయని ఈ సినిమాలో చూపించారు.
కొన్నిసార్లు మన ప్రొఫెషనల్ లైఫ్ చాలా బాగుంటుంది, కానీ పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన జీవితాల్లోని ఎమోషన్స్, రిలేషన్స్, అఛీవ్ మెంట్స్, స్ట్రగుల్స్ అన్నీ ఈ మూవీలో మీరు రిలేట్ చేసుకుంటారని చెప్పుకొచ్చారు.

Also Read: AP Pensions: ఏపీ ప్రజలకు భారీ షాక్.. ఇకపై ఇంటింటికి పథకాలు రావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News