Family Star 1st Day Collections: ఈ సమ్మర్‌లో విడుదల కాబోతున్న ఫస్ట్ బిగ్గెస్ట్ మూవీ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్‌ల 'ఫ్యామిలీ స్టార్'. ఈ రోజు భారీ ఎత్తున విడుదల కాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 700 థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ భారత్ అన్ని కలిపి దాదాపు 1600 పైగా స్క్రీన్స్‌లో సినిమా ప్రదర్శితం కానుంది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రూపేణా.. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు రూ. 1.5 కోట్ల మార్క్‌ను అందుకోబోతున్నట్టు ఈ సినిమా బుకింగ్స్ చూస్తే తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 కోట్ల రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా చేసిన బిజినెస్‌కు ఇది చాలా తక్కువనే చెప్పాలి. ఈ వేసవిలో పెద్ద హీరోల సినిమాలన్ని పోస్ట్ పోన్ అయ్యాయి. ఒక రకంగా ఈ సమ్మర్‌లో రిలీజ్ కాబోతున్న ఏకైక పెద్ద చిత్రం ఇదే కావడం విశేషం.
ఈ సినిమా బుకింగ్స్ చూస్తే ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 8 కోట్ల నుంచి రూ. 10 కోట్ల షేర్ రాబట్టే అవకాశాలున్నాయి. మౌత్ పబ్లిసిటీతో అది మరో రెండు కోట్ల వరకు పెరిగే అవకాశాలున్నాయి. ఓవరాల్‌గా మొదటి రోజు రూ. 12 కోట్ల నుంచి 14 కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశాలున్నాయి. ఈ సినిమా పాజిటివ్ టాక్ వస్తే ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి.
ఈ మధ్యకాలంలో వస్తోన్న విజయ్ దేవరకొండ చిత్రాల్లో ఈ సినిమాకు అతి తక్కువ బుకింగ్స్ అని చెప్పాలి. పైగా యువ ప్రేక్షకులు 'టిల్లు స్క్వేర్' వంటి మాస్ సినిమా మేనియాలో ఉన్నారు. ఫ్యామిలీ స్టార్ క్లిక్ కావాలంటే మహారాజ పోషకులైన యువతకు ఈ సినిమా కనెక్ట్ కావాలి. ఈ సినిమా విషయానికొస్తే.. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. చేస్తున్నారు. దిల్ రాజు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరో, హీరోయిన్స్‌తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా ఎంతో యాక్టివ్‌గా ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా 2 గంటల 30 నిమిషాలకు లాక్ చేశారు.
ఫ్యామిలీ స్టార్ మూవీ అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్ చేసింది.
ఈ మూవీ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..
తెలంగాణ (నైజాం)లో.. రూ. 13 కోట్లు..
రాయలసీమ( సీడెడ్).. రూ. 4.5 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్.. రూ. 17 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 34.50 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్.. రూ. 3 కోట్లు
ఓవర్సీస్ .. రూ. 5.5 కోట్లు..
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 43 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలంటే రూ. 44 కోట్లు రాబట్టాలి. మొత్తంగా విజయ్ దేవరకొండ గత సినిమాల బిజినెస్‌తో సంబంధం లేకుండా మంచి బిజినెస్ చేసింది. 'ఫ్యామిలీ స్టార్' మూవీతో విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో వస్తోన్న ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి.
Also Read: YS Jagan: మళ్లీ ముఖ్యమంత్రి అవుతా.. వలంటీర్ వ్యవస్థపైనే తొలి సంతకం చేస్తా: వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Family Star 1st Day Collections: 'ఫ్యామిలీ స్టార్' బుకింగ్స్ ఎలా ఉన్నాయి.. ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయోచ్చు అంటే.. ?