F3 Collections: నాలుగోరోజు ఎఫ్3 హవా.. క‌లెక్ష‌న్లు ఎంతో తెలుసా?

F3 Movie Collections. మొదటి వీకెండ్‌లో తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్‌లో ఎఫ్3 సినిమా మంచి క‌లెక్ష‌న్లు రాబట్టింది. నాలుగో రోజు కూడా బాక్సాపీస్ వ‌ద్ద త‌న స్టామినా చూపించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 31, 2022, 08:37 PM IST
  • నాలుగోరోజు ఎఫ్3 హవా
  • క‌లెక్ష‌న్లు ఎంతో తెలుసా?
  • మ‌రోసారి మ్యాజిక్
F3 Collections: నాలుగోరోజు ఎఫ్3 హవా.. క‌లెక్ష‌న్లు ఎంతో తెలుసా?

F3 collects 4.64 crores in fourth day: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమా  'ఎఫ్‌ 2'. 2019లో సంక్రాంతి కానుక‌గా విడుద‌లై భారీ విజ‌యాన్ని అందుకున్న ఎఫ్‌ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్‌ 3 తెర‌కెక్కింది. మే 27న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుద‌లై.. ఎఫ్ 2లాగే మ‌రోసారి మ్యాజిక్ చేసి థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల‌ను కడుపుబ్బా నవ్విస్తోంది. మొత్తానికి ఫ‌న్ రైడ్ సినిమా ఎఫ్3 బాక్సాపీస్ వ‌ద్ద త‌న హ‌వా ఏంటో చూపిస్తోంది. 

మొదటి వీకెండ్‌లో తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్‌లో ఎఫ్3 సినిమా మంచి క‌లెక్ష‌న్లు రాబట్టింది. నాలుగో రోజు కూడా బాక్సాపీస్ వ‌ద్ద త‌న స్టామినా చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు రూ.4.64 కోట్లు వసూల్ చేసినట్టు సమాచారం. ఏపీ, తెలంగాణ‌లో నాలుగు రోజుల్లో మొత్తం షేర్ రూ.32.11 కోట్ల‌కు చేరిందట. ఈ సినిమాకు టికెట్స్ రేట్స్ పెంచని విషయం తెలిసిందే. ప్రభుత్వం అనుమతిచ్చిన రేట్లకే టికెట్స్ అభిమానులకు అందుబాటులో ఉన్నాయి. 

శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌ రాజు, శిరీష్‌లు 'ఎఫ్‌ 3' సినిమాను నిర్మించారు. వెంకటేష్, వ‌రుణ్‌ల‌కు జోడీగా త‌మ‌న్నా, మెహ‌రిన్‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. సునీల్, సోనాల్‌ చౌహ‌న్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్, ముర‌ళీ శ‌ర్మ‌, వెన్నెల కిశోర్, అలీ, ర‌ఘుబాబు, అన్న‌పూర్ణ‌మ్మ‌, ప్రగతిలు కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టించారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేశారు. నలుగురు హీరోయిన్స్ ప్రేక్షకులకు అందాల విందు చేశారు. ఇక దేవీ శ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం అందరిని ఆకట్టుకుంది.  

Also Read: Tamannaah Bhatia: అబ్బాయిగా మారిపోయిన తమన్నా భాటియా.. భారీ షాక్‌లో అభిమానులు!

Also Read: Umran malik: ఉమ్రాన్ మాలిక్‌కు నేను పెద్ద అభిమానిని, ఏదో ఓ రోజు పాకిస్తాన్ బౌలర్‌లా.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News