Ester Noronha : ఐరావతం సీక్వెల్ రెడీ.. హైలెట్ అయిన అమర్ దీప్, ఏస్తర్‌

Ester Noronha in Iravatham ఏస్తర్, అమర్ దీప్ వంటి వారు నటించిన ఐరావతం అనే సినిమాకు ఓటీటీలో మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు వచ్చింది. తాజాగా ఈ మూవీ సీక్వెల్‌పై మేకర్లు స్పందించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2023, 08:48 PM IST
Ester Noronha : ఐరావతం సీక్వెల్ రెడీ.. హైలెట్ అయిన అమర్ దీప్, ఏస్తర్‌

Iravatham Sequel on Card ఓటీటీల్లో కంటెంట్ బేస్డ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు మంచి ఆదరణ లభిస్తుంటుంది. ప్రతీ ఓటీటీ సంస్థ సొంతంగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు నిర్మిస్తోంది. ఇక ఓటీటీ సంస్థలు ఎక్కువ అవ్వడం, పోటీ పెరగడంతో కంటెంట్ సైతం ఎక్కువగానే వస్తోంది. ఏ భాషలో తెరకెక్కించినా సరే సబ్ టైటిల్స్‌తో అన్ని భాషల ప్రేక్షకులను వాటిని చూస్తున్నారు.

ఈ క్రమంలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో వచ్చిన ఐరావతం క్లిక్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్ చేసేందుకు రెడీ అయింది చిత్రయూనిట్. ఒక చిన్న సినిమా ఊహించని ప్రజాదరణ దక్కించుకోవడం మామూలు విషయం కాదు. అంతే కాకుండా దాదాపు 250 మిలియన్ల మినిట్స్‌తో దూసుకుపోయింది ఐరావతం. 

ఐరావతంలో నటించిన ఏస్తర్,  తన్వి నెగ్గి, అమర్ దీప్, అరుణ్, సప్తగిరి వంటి వారికి మంచి గుర్తింపు వచ్చింది. గత ఏడాది నవంబర్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ ఎక్కడో ఏదో ఒక మూల ప్లే అవుతూనే ఉంది. డెత్ మిస్టరీలు, సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే ఈ ఐరావతం ఓ వర్గం ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకుంది.

నూజివీడు టాకీస్ పై రేఖ పలగని సమర్పణ లో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట నిర్మాత లుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను స్టార్ట్ చేశారు. త్వరలోనే రాబోయే ఈ సీక్వెల్ కూడా ఇంతే ఆదరణను దక్కించుకుంటుందా? లేదా? అన్నది చూడాలి. ఓటీటీలు ఎక్కువగా పెరగడంతో నటీనటులకు కూడా ఎక్కువగా పర్ఫామెన్స్ చేసేందుకు స్కోప్ దక్కినట్టు అయింది. ఈ మధ్య ఎక్కువగా నోస్తర్ ఓటీటీ కంటెంట్‌కు పర్ఫెక్ట్ చాయిస్‌గా నిలుస్తోంది.

Also Read:  Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?

Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News