King of Kotha OTT: దుల్కర్‘'కింగ్ ఆఫ్ కొత్త’' ఓటీటీ డేట్‍ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Dulquer Salmaan: మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘కింగ్ ఆఫ్ కొత్త’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు అయింది. ఇది ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుందంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 25, 2023, 07:16 PM IST
King of Kotha OTT: దుల్కర్‘'కింగ్ ఆఫ్ కొత్త’' ఓటీటీ డేట్‍ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

King of Kotha OTT: సీతారామం పేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘కింగ్ ఆఫ్ కొత్త’ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను డిస్నీ+ హాట్‍స్టార్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను అధికారికంగా వెల్లడించింది హాట్ స్టార్.  సెప్టెంబర్ 29న ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. కింగ్ ఆఫ్ కొత్త సినిమాను దుల్కర్ సల్మాన్ స్వయంగా వేఫారర్ బ్యానర్‌ కింద నిర్మించారు.  మలయాళంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైంది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం రూ. 20 కోట్ల వరకు నష్టాలను మూటగట్టుకుందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. 

 గ్యాంగ్‍స్టర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అభిలాష్ జోషి తెరకెక్కించారు. ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కింగ్ ఆఫ్ కొత్త మూవీలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‍గా నటించింది. డ్యాన్సింగ్ రోజ్ షబ్బీర్, ప్రసన్న, నైలా ఉషా, చెంబన్ వినోద్, గోకుల సురేశ్, శాంతి కృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు. ఈ మూవీకి నిమిష్ రవి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఈ మూవీలో దుల్కర్ గ్యాంగ్‍స్టర్ రాజు పాత్ర చేశారు. 

రీసెంట్ గా దుల్కర్ నయా మూవీ లక్కీ భాస్కర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) ఫీ మేల్ లీడ్ లో నటిస్తోంది.ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీకర స్టూడియో సమర్పిస్తుంది. 

Also Read: Pushpa 2 Updates: పుష్ప 2 డిజిటల్ రైట్స్ కు రికార్డు స్థాయి ధర.. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News