Dulquer Salmaan: దుల్కర్‌ కొత్త చిత్రం 'లక్కీ భాస్కర్'’.. గ్రాండ్‌గా లాంఛ్.. ఫోటోలు వైరల్

Dulquer Salmaan: సీతారామం ఫేమ్ దుల్కర్ సల్మాన్ కొత్త సినిమాకు 'లక్కీ భాస్కర్' టైటిల్ పెట్టారు మేకర్స్. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2023, 07:47 PM IST
Dulquer Salmaan: దుల్కర్‌ కొత్త చిత్రం 'లక్కీ భాస్కర్'’.. గ్రాండ్‌గా లాంఛ్.. ఫోటోలు వైరల్

Dulquer Salmaan Upcoming Movie: మలయాళీ స్టార్ హీరో, సీతారామం ఫేమ్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)... వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) ఫీ మేల్ లీడ్ లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘లక్కీ భాస్కర్ (LuckyBhaskar) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. 

 తాజాగా ఈ మూవీ పూజా  కార్యక్రమాలను గ్రాండ్ గా ప్రారంభించారు మేకర్స్. ఈ వేడుకలో దుల్కర్‌ సల్మాన్‌తో పాటు మీనాక్షి చౌదరి, నాగవంశీ, సాయిసౌజన్య పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ''ఊహించని విధంగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన ఒక సాధారణ మనిషి కథ'' ఇదని మూవీ యూనిట్ పేర్కొంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీకి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీకర స్టూడియో సమర్పిస్తుంది. 

‘మహానటి,సీతారామం’ సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దుల్కర్. ఇతడికి మాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో టాలీవుడ్ లోనూ అంతే క్రేజ్ ఉంది. రీసెంట్ గా దుల్కర్ గన్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీస్ తోపాటు కింగ్ ఆఫ్ కోథా గ్యాంగస్టర్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి ఇతడి తండ్రి. గత ఏప్రిల్ లో మమ్ముట్టి తల్లి, దుల్కర్ నానమ్మ చనిపోయారు. 

Also read: Sreeleela: విజయ్ దేవరకొండ మూవీ నుంచి శ్రీలీల ఔట్.. కారణం ఇదేనట..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News