Prabhas Project K: ప్రభాస్ సినిమాలో మరో స్టార్ హీరో... ఇక అసలు ఆట షురూ!

Prabhas Project K: నాగ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో వైజయంతి సంస్థ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా మీద భారీ అంచనాలు ఉండగా ఇప్పుడు మరో హీరో సినిమాలో భాగం అవుతున్నాడని అంటున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 20, 2023, 11:08 AM IST
Prabhas Project K: ప్రభాస్ సినిమాలో మరో స్టార్ హీరో... ఇక అసలు ఆట షురూ!

Dulquer Salmaan in Prabhas Project K: మలయాళంలో స్టార్ హీరో అయిన దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. సీతారామం సినిమాలో ఆయన నటించిన రామ్ పాత్ర ప్రేక్షకులందరికీ బాగా దగ్గరైంది. అయితే ఇప్పుడు ఆయన పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే ఆయన ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ప్రాజెక్ట్ కేలో భాగమబోతున్నాడు అనే ప్రచారం జరుగుతోంది.

నాగ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో వైజయంతి సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా జనవరి 12 2024న సంక్రాంతి సందర్భంగా విడుదలవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒకరకంగా ప్రస్తుతానికి ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ డం ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన చేసిన రాధేశ్యామ్, సాహో వంటి సినిమాలు పాన్ ఇండియా మార్కెట్లో ఏ మాత్రం సాటిస్ఫై చేయలేకపోయినా ఇప్పుడు చేస్తున్న అన్ని సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి.

ఒక పక్క ప్రాజెక్టు కే, మరోపక్క ఆది పురుష్ ఇంకో పక్క సలార్ వంటి ఆసక్తికరమైన ప్రాజెక్టులను ప్రభాస్ లైన్ లో పెట్టారు. మహానటి దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు కే మీద దాదాపు అందరి చూపు ఉంది. ఇక తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు దుల్కర్ సల్మాన్ ప్రాజెక్ట్ కేలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ ఈ విషయాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలోనే ఒక అత్యద్భుతమైన సినిమాగా నిలుస్తుందని ఆయన కామెంట్ చేసినట్టు తెలుస్తోంది.

సీతారామం సినిమాని కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ మీదనే నిర్మించగా నాగ అశ్విన్ అలాగే అశ్వినీదత్ టీంకి దుల్కర్ సల్మాన్ బాగా క్లోజ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను ఒక కీలక పాత్ర కోసం సంప్రదించగా ఏ మాత్రం తడబడకుండా వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ సినిమాలో దుల్కర్ సల్మాన్ అదరపు ఆకర్షణ అవుతాడు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకొనే దిశా పఠానీ వారు నటిస్తుండగా అమితాబచ్చన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. 
Also Read: Taraka Ratna Death: ఆ ఒక్కడు లేకుంటే బాబు, లోకేష్ ఆ మరకతోనే జీవించాల్సి వచ్చేది!

Also Read: Balakrishna Taraka Ratna Family: తారక రత్న కుటుంబం విషయంలో బాలకృష్ణ కీలక నిర్ణయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

 
 

Trending News