Dulquer Salmaan Telugu Film : సీతారామం తరువాత మరో తెలుగు సినిమా ఒప్పుకున్న దుల్కర్ సల్మాన్?

Dulquer Salmaan one More Telugu Film: సీతారామం అనే తెలుగు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మరో తెలుగు సినిమా కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఆ వివరాలు 

Last Updated : Dec 31, 2022, 08:18 PM IST
Dulquer Salmaan Telugu Film : సీతారామం తరువాత మరో తెలుగు సినిమా ఒప్పుకున్న దుల్కర్ సల్మాన్?

Dulquer Salmaan Agreed one More Telugu Film with Pavan Sadineni: ఈ మధ్యకాలంలో తెలుగు దర్శకులు- తమిళ, మలయాళ హీరో కాంబినేషన్లు ఎక్కువగా సెట్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు దర్శకులు తమిళ హీరోలు, తమిళ దర్శకులు తెలుగు హీరోలు ఇలా కాంబినేషన్ సెట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు మరో మలయాళ హీరోని తెలుగు దర్శకుడు లైన్లో పెట్టారు. ఆ మలయాళ హీరో మరెవరో కాదు సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్.

మలయాళంలో మమ్ముట్టి కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసి తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోగా మలయాళంలో కొనసాగుతున్న దుల్కర్ సల్మాన్ తెలుగులో ఈ ఏడాది సీతారామం అనే సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పటికే తమిళంలో కొన్ని సినిమాలు చేస్తున్న ఆయన మొట్టమొదటిసారిగా తెలుగులో సీతారామం సినిమా చేయగా  దాన్ని మలయాళంలో అలాగే ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు.

అక్కడ కూడా ఈ సినిమా మంచి వసూళ్లే రాబట్టింది. తాజాగా ఆయన తెలుగు దర్శకుడు పవన్ సాదినేని చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తెలుగులో ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పవన్ సాదినేని తర్వాత నారా రోహిత్ తో సావిత్రి అనే సినిమా చేశాడు. ఆ సినిమా చేసిన తర్వాత చాలా గ్యాప్ తీసుకుని సేనాపతి అనే ఓటీటీ ఫిలింతో మన ముందుకు వచ్చారు.

ఆహా లో విడుదలైన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించారు. సరిగ్గా సినిమా విడుదలైన ఏడాదికి తాను దుల్కర్ సల్మాన్ ను కలిశానని 2022 ఒక మంచి న్యూస్ చెప్పిందని పవన్ సాదినేని తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. 2023కి మంచి గిఫ్ట్ దొరికిందని త్వరలోనే డీటెయిల్స్ చెబుతాను అంటూ పవన్ సాధినేని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఆయన దుల్కర్ సల్మాన్తో సినిమా చేయబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. అయితే నిజంగానే దుల్కర్ సల్మాన్తో ఆయన సినిమా చేస్తున్నారా? లేదా? అనే విషయం మీద మాత్రం అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read: Rishabh Pant's Money Looted: యాక్సిడెంట్ అయి పడి ఉంటే రిషబ్ పంత్ డబ్బు లూటీ చేశారా?

Also Read: Hyderabad Police: మందేసి రోడ్డెక్కారా ఇక మీ 'అంతే'.. ఈ రోడ్లు అన్నీ క్లోజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News