SSMB 28: మహేష్ కోసం స్ట్రాంగ్ విలన్ ను సెట్ చేసిన త్రివిక్రమ్.. హ్యాట్రిక్కే!

Dual Hatrick Combination : సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమా కోసం మరో హ్యాట్రిక్ కాంబో సెట్ చేసినట్టుగా తెలుస్తోంది, ఇప్పటికే త్రివిక్రమ్ ఈ మేరకు అన్ని పనులు పూర్తి చేశారట. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 13, 2023, 10:58 AM IST
SSMB 28: మహేష్ కోసం స్ట్రాంగ్ విలన్ ను సెట్ చేసిన త్రివిక్రమ్.. హ్యాట్రిక్కే!

Dual Hatrick Combination for SSMB 28: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్, హారిక హాసిని బ్యానర్ల సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే ఇప్పటికే హీరోయిన్ గా ఎంపికైనట్లు అధికారిక ప్రకటన వచ్చింది. మరో హీరోయిన్ పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీ లీల నటిస్తున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది, కానీ ఈ విషయం మీద అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన విలన్ గా జగపతిబాబు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సినీ నిర్మాత నాగ వంశీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మహేష్ బాబుతో జగపతిబాబు చేస్తున్న మూడో సినిమా ఇదే కాగా మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న మూడు సినిమా కూడా ఇదే. గతంలో మహేష్ బాబుతో జగపతిబాబు శ్రీమంతుడు, మహర్షి వంటి సినిమాలు చేశారు.

అలాగే మహేష్ బాబుతో త్రివిక్రమ్ అతడు, ఖలేజా వంటి సినిమాలు చేశారు. ఇప్పుడు అదే కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ఈ ముగ్గురు కలిసి పనిచేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇక మహేష్ బాబు అభిమానులు ఈ 28వ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత చేస్తున్న సినిమా రాజమౌళితో కావడంతో ఈ సినిమా కూడా హిట్ కావడం ఎంతో కీలకమని వారంతా భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని సంస్థలు చాలా తెలివిగా నటీనటులను, ఇతర టెక్నీషియన్లను ఎంపిక చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఒకప్పుడు హీరోగా అలరించిన జగపతి బాబు ఇప్పుడు విలన్ గా మారి అనేక సినిమాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆయన ఏమేరకు విలనిజం పండించనున్నారు అనేది చూడాలి మరి. 

Also Read: Rakul Preet Latest: గాగ్రా చోళీలో రకుల్ ప్రీత్ హాట్ ట్రీట్.. సింపుల్ గా కనిపిస్తూనే కవ్విస్తోంది!

Also Read: Ketika Sharma Bold Photos: ప్యాంట్ బటన్లు విప్పేస్తున్న కేతిక శర్మ.. కుర్రకారు తట్టుకోగలరా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News