Celebrities at IIFA awards 2024: ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్ 2024 భారతీయ సినీ ఇండస్ట్రీకి భారీ స్థాయిలో పిలుపునిచ్చింది. హిందీ నుండి మాత్రమే కాక సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమల్లోని ప్రతిభావంతులను సత్కరించడానికి ఐఫా బృందం రెడీ అయ్యింది.
అవార్డులతో పాటు పలు సెలబ్రిటీల లైవ్ పెర్ఫార్మెన్సులు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ స్టార్లు రేఖా, షాహిద్ కపూర్ కూడా ఈ వేడుకలో పర్ఫార్మ్ చేయబోతున్నారు. ఇవాళ అంటే సెప్టెంబర్ 27 నుండి 29 వరకు అబుదాబి, యాస్ ఐలాండ్‌లో మూడు రోజుల పాటు ఈ అవార్డు వేడుకలు జరగనున్నాయి.
తెలుగులో హీరోలు రానా దగ్గుబాటి, తేజ సజ్జా కలిసి IIFA ఉత్సవాన్ని హోస్ట్ చేయనున్నారు. అనంతరం శనివారం షారుఖ్ ఖాన్, కరణ్ జోహర్, విక్కీ కౌశల్ IIFA అవార్డ్స్ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తారు.
క్లైమాక్స్ లో 22 నిమిషాలు ఉండే రేఖా పెర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే, దేవి శ్రీ ప్రసాద్, ప్రభుదేవా, రాశీ ఖన్నా, జాన్వీ కపూర్, అనన్య పాండే, కృతి సనన్ వంటి స్టార్స్ కూడా ఈ వేడుకలో పాలుపంచుకుంటున్నారు.
ఈ వేడుకలో భాగంగా దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మొదట పరిచయం అయింది తెలుగు సినిమాతో అని అన్నారు. అక్కడే ఉన్న కృతి మైక్ తీసుకుని "ఆ తుజో మోగ్ కోర్తా. ఇప్పుడు నేను మాట్లాడింది కొంకణి భాష" అని చెప్పుకొచ్చింది. దానికి దేవి శ్రీ ప్రసాద్ "మీరు ఈర్ష పడొద్దు. కృతి నాకు ఐ లవ్ యు చెప్పింది. మీ టూ కృతి. అది నేను కృతి కోసం చేసిన మొదటి పాట మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది కృతి. సూపర్ స్టార్, నేను ఎప్పుడూ మాట్లాడుకుంటూ మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. మీరు ఎదిగిన విధానం.. మీరు ఇప్పుడు ఉన్న స్థానం చూసి నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది" అని అన్నారు.
ఇక ఈ వేడుకను హోస్ట్ చేయబోతున్న రానా తేజ గురించి మాట్లాడుతూ.. దేవిశ్రీప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. "నా స్నేహితులను ఇక్కడ చూసి చాలా సంతోషంగా ఉంది. వెరీ నాటీ రానా.. పైకి డీసెంట్ గా కనిపించే వెరీ ఇండిసెంట్ తేజ.. తేజ సజ్జ నీకు లేవు సిగ్గు లజ్జ" అని అన్నారు దేవి శ్రీ ప్రసాద్. అయితే దానిని సరదాగానే తీసుకున్న తేజ మైక్ తీసుకుని "సాయంత్రం మైక్ నా చేతుల్లో ఉండబోతుంది.. నీ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో ముందు నుంచి ప్లాన్ చేస్తాను" అని నవ్వుతూ అన్నారు.
Also Read: Sobhita Chaitanya: నాకు నాగచైతన్యతో పిల్లలు కనాలని ఉంది: శోభిత ధూళిపాల
Also Read: KTR Comments on Devara: దేవర ఈవెంట్ రద్దుపై కేటీఆర్ సంచలన కామెంట్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.