"శివ" మ్యాజిక్ వర్మ రిపీట్ చేస్తాడా..?

Last Updated : Oct 4, 2017, 02:54 PM IST
"శివ" మ్యాజిక్ వర్మ రిపీట్ చేస్తాడా..?

రామ్ గోపాల్ వర్మ మొదటి చిత్రం "శివ" చిత్రం ఎన్ని రికార్డులు తిరగరాసిందో చెప్పక్కర్లేదు. అదే సినిమా అక్కినేని నాగార్జున సినీ జీవితాన్ని కూడా తిరగరాసింది. అలాగే తెలుగు సినీ చరిత్ర పేజీల్లో తనకుంటూ ఒక అధ్యాయాన్ని తయారుచేసుకున్న సినిమా అది. ఈ విషయాన్ని పక్కన పెడితే, గత కొన్ని నెలలుగా కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం ప్రారంభించాయి. రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతుందని, అది కూడా శివ సినిమా రేంజ్‌లోనే  ఉంటుందని కొన్ని వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై వర్మ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా వివరణ ఇచ్చాడు."25 ఏళ్ళ తర్వాత నాగ్‌తో ఓ చిత్రం చేయబోతున్నాను. ఆ సినిమా శివ స్థాయిలోనే ఉంటుందని కొన్ని వార్తలు వస్తున్నాయి. కాని నేను నాగ్‌తో భవిష్యత్తులో చేసే చిత్రం..  శివ సినిమాకు కాని, స్టోరీకి కాని ఏ మాత్రం పోలికలు లేకుండా ఉంటుంది" అన్నాడు వర్మ. తాను దర్శకత్వం వహించే చిత్రం  రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని వర్మ స్పష్టంగా పోస్టు చేశారు.

Trending News