Ante Sundaraniki Bamma: అంటే సుందరానికి బామ్మ బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా.. సితార, అల్లు అర్హలకు కూడా?

Ante Sundaraniki Bamma Aruna Bhikshu: అంటే సుందరానికి బామ్మ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి, ఆమె ఒక యాక్టింగ్ ట్రైనర్ అని, ఒక కూచిపుడి డ్యాన్స్ ట్రైనర్ అని తెలుస్తోంది. ఆ వివరాలు   

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 6, 2022, 03:29 PM IST
Ante Sundaraniki Bamma: అంటే సుందరానికి బామ్మ బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా.. సితార, అల్లు అర్హలకు కూడా?

Do You Know Ante Sundaraniki Bamma is an Acting Trainer: నాని హీరోగా రూపొందిన అంటే సుందరానికి సినిమా డీసెంట్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరి మన్ననలు అందుకుంది. అయితే ఈ సినిమాలో నాని బామ్మ పాత్రలో నటించిన నటీమణి పెద్దగా సినిమాల్లో కనిపించింది లేదు.

కానీ ఆమె బ్యాక్ గ్రౌండ్ మాత్రం మామూలు బ్యాక్ గ్రౌండ్ కాదని తెలుస్తోంది. ఆమె పేరు అరుణ భిక్షు కాగా ఆమె ఎస్సెన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో డాన్స్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ లో ఆమె ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. డాన్స్ లో పీహెచ్డీ పొందిన ఆమె కూచిపూడి అనేక మందికి నేర్పించారు. అంతేకాక ఇప్పుడు ఆమె గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

అదేమిటంటే మహేష్ బాబు కుమార్తె సితారకు కూచిపూడి డాన్స్ నేర్పిస్తున్నది కూడా ఆమెనే. ఇక మహేష్ బాబు కుమార్తె సితార డాన్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. కూచిపూడికి సంబంధించిన కొన్ని డాన్స్ స్టెప్స్ ని కూడా మహేష్ బాబు గతంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే యాని మాస్టర్ ఆమెకు డ్యాన్స్ నేర్పిస్తూ ఉండడంతో కూచిపూడి కూడా ఆమెను నేర్పించి ఉండవచ్చు అని అందరూ భావించారు.

 కానీ ఆ డాన్స్ నేర్పించింది అరుణ బిక్షు అనే విషయాన్ని తాజాగా సితార ఆమెకు పుట్టినరోజు విషెస్ చెప్పడం ద్వారా తెలియజేసింది. ఇక అరుణ భిక్షు పుట్టినరోజు సందర్భంగా సితార అలాగే బన్నీ కుమార్తె అల్లు అర్హ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న వీడియోని అరుణ భిక్ష కుమార్తె మహితా భిక్షు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీంతో అరుణ భిక్షు కేవలం నటి మాత్రమే కాదు డాన్స్ మాస్టర్ కూడా అనే విషయం బయటకు వచ్చింది. అంతేకాక అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ మాట్లాడుతూ తనకు యాక్టింగ్ నేర్పినందుకు కూడా థాంక్స్ చెప్పడంతో ఆమె యాక్టింగ్ నేర్పిస్తున్నారని అల్లు అర్జున్ ఇప్పటి నుంచే తన కుమార్తెకు యాక్టింగ్ నేర్పిస్తున్నారు అనే విషయం కూడా తేటతెల్లమైంది.

Also Read: Nandamuri Fans: నందమూరి ఫాన్స్ కు గుడ్ న్యూస్.. వారసుడు పని మొదలెట్టేశాడు!

Also Read: Keerthy Suresh Casting Couch : నేను అలాంటిదాన్ని కాదు.. కమిట్మెంట్లపై నోరు విప్పిన కీర్తి సురేష్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News