Saranga Dariya Song Dispute: సారంగ దరియా పాట చుట్టూ వివాదం, పాటకు అసలు ఓనర్ ఎవరు మరి

Saranga Dariya Song Dispute: దాని కుడీ భుజం మీద కడువా..దాని గుట్టెపు రైకలు మెరియా..అది రమ్మంటే రాదుర సెలియా...దాని పేరే సారంగ దరియా....ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పాట హల్‌చల్ చేస్తోంది. అంతకంటే ఎక్కువగా పాట చుట్టూ వివాదం ముదురుతోంది. ఈ పాటకు ఓనర్ ఎవరు మరి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 8, 2021, 11:37 AM IST
  • సారంగ దరియా పాట చుట్టూ వివాదం. పాటకు ఆసలు ఓనర్ ఎవరు
  • జానపద గేయాలకు ఓనర్లు ఉండరంటున్న సుద్దాల అశోక్ తేజ మాటలపై విమర్శలు
  • సారంగ దరియా పాటను కోమలే సేకరించిందని చెప్పిన దర్శకుడు శేఖర్ కమ్ముల
Saranga Dariya Song Dispute: సారంగ దరియా పాట చుట్టూ వివాదం, పాటకు అసలు ఓనర్ ఎవరు మరి

Saranga Dariya Song Dispute: దాని కుడీ భుజం మీద కడువా..దాని గుట్టెపు రైకలు మెరియా..అది రమ్మంటే రాదుర సెలియా...దాని పేరే సారంగ దరియా....ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పాట హల్‌చల్ చేస్తోంది. అంతకంటే ఎక్కువగా పాట చుట్టూ వివాదం ముదురుతోంది. ఈ పాటకు ఓనర్ ఎవరు మరి.

నాగ్ చైతన్య(Nag Chaitanya), సాయిపల్లవి(Sai pallavi) కధానాయకా నాయికలుగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar kammula) తెరకెక్కిస్తున్న లవ్‌స్టోరీ (Love story) చిత్రంలో సాంగ్ ఇప్పుడు సినిమా కంటే ముందే ప్రజల్లో దూసుకెళ్లిపోయింది. ఉప్పెనలో హైలైట్‌గా నిలిచిన పాటలాగే ఉర్రూతలూగిస్తూ వైరల్ అవుతోంది. ఆ పాటే సారంగ దరియా పాట. చక్కని జానపద సాహిత్యంతో..పల్లెల్లో పాడుకునే చూడచక్కని పాట. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా జానపదమే ప్రదానంగా సాగుతుంది.  విడుదలైన కొద్దిరోజుల్లోనే  కోట్లాది వ్యూస్ సంపాదించుకుంది ఈ పాట. 

మరి వివాదం ఎందుకు. ఎందుకంటే ఈ పాట జానపదం కాబట్టి. ఈ పాటను  సినిమాలో రచయితగా ఉన్న సుద్దాల అశోక్ తేజ(Suddala Ashok teja) న్యాయనిర్ణేతగా ఉన్న రేలా రే షోలో కోమలి పాడింది కాబట్టి. కేవలం రేలా రే(Rela re program) కార్యక్రమంలా కోమలి పాడటమే వివాదానికి కారణం కాదు. ఈ పాటను శేఖర్ కమ్ముల ఎంపిక చేయడానికి కారణమే ఈ కార్యక్రమం. అసలేం జరిగిందంటే...సుద్దాల అశోక్ తేజ న్యాయమూర్తిగా ఉన్న రేలా రే కార్యక్రమంలో కోమలి పాడిన ఈ పాట చూసి శేఖర్ కమ్ములను ఆకట్టుకుంది. సినిమాలో పాటల రచయిత సుద్దాల అశోక్ తేజను ఈ పాట తీసుకుందామని కోరారు. దానికి సమ్మతించిన సుద్దాల అశోక్ తేజ...ఒరిజినల్ పల్లవి అలాగే ఉంచి..మరో పల్లవి జత చేర్చారు. 

ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఏ పాటను చూసి ఇంప్రెస్ అయి..సినిమాలో తీసుకున్నారో ఆ  పాట పాడిన గాయని కోమలి(Komali)కి గుర్తింపు ఇవ్వకపోవడం కనీసం మాటవరసకైనా చెప్పకపోవడమే వివాదానికి కారణమైంది. కోమలి కన్నీళ్లకు దారి తీసింది. ఇదే విషయాన్ని ప్రశ్నించినప్పుడు జానపదానికి ఓనర్లు ఎవరూ లేరని సుద్దాల అశోక్ తేజ చెప్పడం ఎంతవరకూ సమంజసమనే ప్రశ్న విన్పిస్తోంది. జానపదానికి ఓనర్లు లేరన్నది వాస్తవమే కానీ జానపదాన్ని సేకరించినవారికి గుర్తింపు ఇవ్వాలి కదా మరి. జానపదాన్ని సుద్దాల అశోక్ తేజ సేకరించినట్టు రాసుకున్నప్పుడు అదే పాటను శేఖర్ కమ్ములకు పరిచయం చేసిన కోమలి...అశోక్ తేజ కంటే ముందే సేకరించినట్టు కాదా. అటువంటప్పుడు సినిమాలో సారంగ దరియా పాటను సేకరించింది కోమలే అని పేరు రాసి..ఆమెకా గుర్తింపు ఇచ్చి ఉంటే తప్పేముందని పలువురు విమర్శిస్తున్నారు. కోమలి ఈ పాటను సేకరించిందని దర్శకుడు శేఖర్ కమ్ముల..సుద్దాల అశోక్ తేజతో చెప్పినప్పుడు...జానపదానికి ఓనర్లెవరూ లేరని అశోక్ తేజ చెప్పడం ఏ మేరకు సరైందనే విమర్శలు వస్తున్నాయి. 

జానపదం ఎప్పుడూ సేకరణతోనే ముందుకొస్తుందనేది నిజమే. కానీ సారంగ దరియా పాట(Saranga Dariya song)ను సుద్దాల అశోక్ తేజ కంటే ముందే సేకరించింది కోమలే కదా అనే వాదన ఇప్పుడు గట్టిగా విన్పిస్తోంది. మరి దీనికి సుద్దాల అశోక్ తేజ ఏం సమాధానం చెబుతారో చూడాలి.

Also read: Parineeti chopra: బ్యాక్‌లెస్..బ్లాక్‌డ్రెస్‌లో అద్దరగొడుతున్న పరిణితి చోప్రా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News