Director Teja - Pooja Hegde: పూజా హెగ్డే ఎవరు? నాకు తెలీదే!.. డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్!

Director Teja on Pooja Hegde: తెలుగులో టాప్ హీరోయిన్ గా పలు పెద్ద ప్రాజెక్టులలో భాగమైన పూజా హెగ్డే ఎవరో తనకు తెలియదని డైరెక్టర్ తేజ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలలోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 5, 2022, 08:12 PM IST
Director Teja - Pooja Hegde: పూజా హెగ్డే ఎవరు? నాకు తెలీదే!.. డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్!

Director Teja Interesting Comments on Pooja Hegde: పూజా హెగ్డే ప్రస్తుతానికి తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా మంచి ఫామ్ లో దూసుకుపోతోంది. పూజా హెగ్డే ఎలాంటి సినిమా చేసినా ఆమెకు మంచి క్రియేట్ అయితే లభిస్తుంది. తమిళంలో ముగపూడి అనే సినిమాతో పరిచయమైన పూజా హెగ్డే తర్వాత తెలుగులో ముకుంద అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ చేసింది. ఆ తర్వాత హిందీలో కూడా ఆమె పలు సినిమాలు చేసింది. అయితే ఆమెకు అల్లు అర్జున్ తో చేసిన డీజే సినిమా తీసుకువచ్చిన క్రేజ్ అంతా ఇంకా కాదు.

ఆ సినిమా దెబ్బతో ఆమె మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే పడలేదు. ఆమె దాదాపు చేస్తున్న సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. అయితే ఈ ఏడాది ఆమె చేసిన సినిమాలు ఏమీ హిట్టు కాలేదు, రాధేశ్యామ్, బీస్ట్ ఆచార్య వంటి సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలవగా అయినా ఆమె డిమాండ్ మాత్రం ఏమీ తగ్గడం లేదు. ప్రస్తుతం తెలుగులో ఉన్న హీరోయిన్లు అందరిలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ పూజా హెగ్డే టాప్ ప్లేస్ లో ఉండగా అసలు ఆ హీరోయిన్ ఎవరో నాకు తెలియదంటూ దర్శకుడు ఆసక్తికరమైన కామెంట్ చేశారు.

తాజాగా జీ తెలుగు న్యూస్ కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో దర్శకుడు తేజను ఒక ప్రశ్న సంధించారు. తెలుగు హీరోయిన్స్ లో ఎవరి యాక్టింగ్ మీకు నచ్చుతుంది? మీకు ఎవరు ఇష్టం అని అడిగితే సమంత యాక్టింగ్ తనకు బాగా నచ్చుతుందని పేర్కొన్న ఆయన కొందరు పేర్లు చెప్పండి వాళ్ళ గురించి నేను చెబుతానని అన్నారు. ఈ సందర్భంగా రష్మిక మందన సహా పూజా హెగ్డే పేరు చెప్పగా అసలు పూజా హెగ్డే ఎవరు అంటూ ఎదురు ప్రశ్నించారు.

అయితే తెలుగులో టాప్ హీరోయిన్ గా పలు పెద్ద ప్రాజెక్టులలో భాగమైన పూజా హెగ్డే ఎవరో తనకు తెలియదని ఈ సందర్భంగా తేజ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది, ప్రస్తుతానికి దర్శకుడు తేజ దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ అహింస అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న తరుణంలో దర్శకుడు తేజ చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి అని చెప్పక తప్పదు.

Also Read: Vishwak Sen on Arjun Sarja: అన్నీ అర్జున్ చెప్పినట్టే జరగాలా? అందుకే సినిమా నుంచి తప్పుకున్నానంటూ విశ్వక్ సేన్ సంచలనం!

Also Read: Ram Charan - Vishwaksen : విశ్వక్ సేన్ కారెక్టర్ ఇదేనా?.. రామ్ చరణ్‌వి ఒట్టి మాటలేనా?.. కెరీర్ మీద మచ్చ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News