ఎన్టీఆర్ పాత్రలో నటించేదెవరు ?

Last Updated : Oct 11, 2017, 12:18 PM IST
ఎన్టీఆర్ పాత్రలో నటించేదెవరు ?

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరపైకి వస్తున్న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాలో హీరో, హీరోయిన్లు ఎవరనే దానిపై గత కొన్ని రోజులుగా జోరుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. .ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రతో పాటు... ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి పాత్రలో ఎవరు నటిస్తారన్న విషయంపై  ఉత్కంఠత నెలకొంది. ఎన్టీఆర్‌ పాత్రలో విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ , లక్ష్మీ పార్వతి పాత్రంలో రోజా నటించనున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి.  దీనిపై దర్శకుడు వర్మ క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటించడం లేదని తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేశారు. అయితే రోజా విషయంలో మాత్రం వర్శ ఖండించలేదు.   

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’  సినిమాలో ప్రకాశ్‌ రాజ్‌ ఎన్టీఆర్ పాత్రలో  నటిస్తున్నట్లు కొన్ని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అందులో ఈ మాత్రం వాస్తవం లేదు. దీనిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా.. ఇప్పటి వరకు నటీనటులుగా ఎవర్నీ ఎంపిక చేయలేదు. త్వరలోనే వాటి వివరాలు తెలియజేస్తానని ఫేస్‌బుక్‌లో వర్మ వెల్లడించారు. 

Trending News