Radhe Shyam Postponed: RRR బాటలో రాధేశ్యామ్- సినిమా రిలీజ్ వాయిదా వేసిన చిత్ర యూనిట్

Radhe Shyam Postponed: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఇది చేదు వార్త. సంక్రాంతికి అందరినీ అలరిస్తుందనుకున్న 'రాధేశ్యామ్' మూవీ రిలీజ్ వాయిదా పడనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. కరోనా సంక్షోభం దృష్ట్యా వాయిదా పడనుంది. ఇదే విషయమై 'రాధేశ్యామ్' చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్విట్టర్ లో పరోక్షంగా స్పందించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2022, 02:04 PM IST
Radhe Shyam Postponed: RRR బాటలో రాధేశ్యామ్- సినిమా రిలీజ్ వాయిదా వేసిన చిత్ర యూనిట్

Radhe Shyam Postponed: టాలీవుడ్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రాలు 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ, దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' కూడా వాయిదా పడే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరిగింది. 

అయితే న్యూఇయర్ సందర్భంగా ఆ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లో 'రాధేశ్యామ్' మూవీని సంక్రాంతికి అనగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కానీ, ప్రస్తుతం దేశంలో రోజురోజుకు పరిస్థితులు వేగంగా మారుతున్న క్రమంలో ఇప్పుడు రాధేశ్యామ్ మూవీ కూడా వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యేలా 'రాధేశ్యామ్' మూవీ దర్శకుడు ఓ ట్వీట్ చేశాడు. 

"కొన్నిసార్లు సమయం కూడా కఠినంగా మారుతుంది. హృదయాలు బలహీనంగా మారుతాయి. మనస్సులు అల్లకల్లోలంగా ఉంటాయి. జీవితం మనకు ఏది ఇచ్చినా.. మన ఆశలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉండాలి. సురక్షితంగా ఉండండి - టీమ్ రాధేశ్యామ్" అంటూ దర్శకుడు రాధేశ్యామ్ ట్వీట్ చేశాడు. 

ఈ ట్వీట్ ను పరిశీలించిన కొందరు సినీ విశ్లేషకులు.. 'రాధేశ్యామ్' విడుదల వాయిదా కానుందని స్పష్టం చేశారు. పరోక్షంగా రాధేశ్యామ్ టీమ్ తరఫున సినిమాను వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు తెలియజేస్తున్నట్లు ఉంది. 

అయితే సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమా విడుదల కావాల్సిఉంది. సినిమా రిలీజ్ డేట్ సమీపిస్తున్నా.. 'రాధేశ్యామ్' చిత్రబృందం ఎలాంటి ప్రమోషన్స్ చేపట్టడం లేదు. ఈ పరిస్థితులను బట్టి సినిమా రిలీజ్ వాయిదా తప్పదని తెలుస్తోంది. అదే నిజమైతే.. సంక్రాంతి బరిలో ఈసారి పెద్ద సినిమాలు విడుదల కావని తెలుస్తోంది.  

Also Read: Radhe Shyam OTT offer: 'రాధేశ్యామ్' సినిమాకు కళ్లు చెదిరే ఓటీటీ ఆఫర్.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?

Also Read: RGV Fires on AP Govt: ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై ఆర్జీవీ ఫైర్.. మంత్రి పేర్ని నానిపై ప్రశ్నల వర్షం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News