Director Puri Jagannadh open Letter to Audience: గత కొద్ది రోజులుగా లైగర్ సినిమా డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అలాగే డైరెక్టర్ పూరి జగన్నాధ్ మధ్య ఒక వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎగ్జిబిటర్లు పూరి జగన్నాథ్ నివాసం ముందు ధర్నా చేయడానికి సిద్ధమవుతూ ఉండగా పూరి జగన్నాథ్ వారందరికీ వార్నింగ్ ఇస్తూ విడుదల చేసిన ఒక ఆడియో క్లిప్ వైరల్ అయింది,. ఆ తర్వాత ఆయన పోలీసులకు కూడా సినిమా లైగర్ ఫైనాన్సియర్ శోభన్ అలాగే లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబానికి హాని కలిగించే అవకాశం ఉందంటూ పూరి జగన్నాథ్ ఫిర్యాదు చేయడంతో ఇకమీదట పూరి జగన్నాథ్ సినిమాలకు ఫైనాన్స్ చేయకూడదని తెలుగు సినిమా ఫైనాన్సియర్ల సంఘం వారు నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపద్యంలో పూరి జగన్నాథ్ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఒక సుదీర్ఘ లేఖను తన పీఆర్ టీమ్ ద్వారా విడుదల చేశారు ఆయన రాసిన లేక యధాతధంగా. ‘’సక్సెస్ అండ్ ఫైల్యూర్, ఈ రెండూ ఒకదానికి ఒకటి వ్యతిరేకం అనుకుంటాం, కాదు. ఈ రెండూ ఫ్లోలో ఉంటాయి. ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తాయి. గుండెల నిండా ఊపిరి పీలిస్తే బతుకుతామని అనుకుంటాం. కానీ వెంటనే చెయ్యాల్సిన పని ఏంటి ? ఊపిరి వొదిలెయ్యటమే. పడతాం, లేస్తాం. ఏడుస్తాం, నవ్వుతాం. ఎన్నో రోజులు నెక్స్ట్ జరిగేది ఏంటి ? పగలబడి నవ్వటమే .. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు.
లైఫ్ లో మనకి జరిగే ప్రతి సంఘటనని మనం ఒక ఎక్స్ పీరియన్స్ లా చూడాలి తప్ప, ఫెయిల్యూర్ సక్సెస్ లా చూడకూడదు. నడిచా, మెట్లు ఎక్కా, పడిపోయా, కాలు జారింది, నదిలో పడ్డా, కొట్టుకుపోయా, ఒడ్డుకు చేరా, ఇంట్లో తిట్టారు, వూరు వెలేలేసింది, ఉరేసుకోవాలనిపించింది, ఎవడో కాపాడాడు, వాడు నేను కౌగిలించుకున్నాం, వాడే మోసం చేసాడు, ఇలా ఎన్నెన్నో లైఫ్ లో జరుగుతుంటాయి. అవన్నీ సీన్లే. అందుకే లైఫ్ ని సినిమాలా చూస్తే, షో అయిపోగానే మర్చిపోవచ్చు. మైండ్ కి తీసుకుంటే మెంటల్ వస్తాది. సక్సెస్ ఐతే డబ్బులొస్తాయి. ఫెయిల్ ఐతే బోలెడు జ్ఞానం వస్తాది. సో ఎప్పుడూ మనం మెంటల్లీ, ఫైనాన్షియల్లీ ఏదో ఒకటి సంపాదిస్తూనే ఉంటాం తప్ప, ఈ ప్రపంచంలో మనం కోల్పోయేది ఏదిలేదు. అందుకే దేన్నీ ఫైల్యూర్గా చూడొద్దు.
చెడు జరిగితే మన చుట్టూ ఉన్న చెడు వ్యక్తులు అందరూ మాయమైపోతారు.. వెనక్కి తిరిగి చూస్తే ఎవడు మిగిలాడో తెలుస్తుంది. మంచిదే కదా ? కానీ ఖాళీగా ఉండకూడదు. ఏదోకటి చెయ్యాలి.. అది రిస్క్ అవ్వాలి. లైఫ్ లో రీస్క్ చెయ్యకపోతే అది లైఫీ కాదు. ఏ రిస్క్ చెయ్యకపోతే అది ఇంకా రిస్క్. లైఫ్ లో నువ్వు హీరో ఐతే, సినిమాలో హీరోకి ఎన్ని జరిగాయో అవన్నీ నీకు కూడా జరుగుతాయి. పొగుడుతారు, నిందిస్తారు, బొక్కలో వస్తారు, మళ్ళీ విడుదల చేస్తారు, అందరూ చప్పట్లు కొడతారు. అక్షింతలు వేస్తారు. సో ఇవన్నీ మీ లైఫ్ లో జరగకపోతే, జరిగేలా చూడండి. లేకపోతే మీరు హీరో కాదేమో అనుకునే ప్రమాదం ఉంది. అందుకే మనం హీరో లా బతకాలి. బతకాలి అంటే నిజాయితీగా ఉండాలి.
నేను నిజాయితీ పరుడుని అని చెప్పుకొనవసరంలేదు. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది. TRUTH ALWAYS DEFENDS ITSELF. ఎవరి నుంచి ఏదీ ఆశించకుండా, ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పొతే మనలన్ని పీకే వాళ్ళు ఎవరూ ఉండరు. నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ఆడియన్స్ ని తప్ప నేను ఎవరినీ మోసం చేయలేదు. ACTULLY IM LIABLE TO MY AUDIENCE. మళ్ళీ ఇంకో సినిమా తీస్తా. వాళ్ళని ఎంటర్టైన్ చేస్తా. ఇక డబ్బు అంటారా? చచ్చినాక ఇక్కడ నుండి ఒక్క రూపాయి తీసుకెళ్లిన ఒక్కడి పేరు నాకు చెప్పండి, నేనూ దాచుకుంటా. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే .. మధ్యలో జరిగేది అంతా డ్రామా’’ అంటూ పూరి జగన్నాధ్ పేర్కొన్నారు.
Also Read: Pranitha Subhash Latest Photoshoot : ప్రణీత.. ఏంటీ అందాల ఆరబోత.. తల్లైనా తగ్గేదేలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook